పవన్ కళ్యాణ్ నినాదానికి బిజెపి ఫిదా, జవదేకర్ కితాబు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం లేదా ఇతర పార్టీలతో పొత్తుల అంశానికి సంబంధించి తాము హైదరాబాదుకు వచ్చినప్పుడు చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ, సీమంధ్ర ప్రాంతాలకు చెందిన రెండు రాష్ట్రాల కమిటీలతో చర్చించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కాగా, పవన్ కాంగ్రెస్ హఠావో.. నినాదాన్ని పలువురు బిజెపి నేతలు స్వాగతిస్తున్నారు.
త్వరలో తెలంగాణలో సోనియా, రాహుల్ పర్యటన
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 29 మధ్య హైదరాబాదు, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ సభలకు సోనియా, రాహుల్‌లు హాజరుకానున్నారని తెలుస్తోంది.
మహంతితో అనిల్ గోస్వామి భేటీ
సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలు, అకాడమీలు, అధికారుల పంపకాలపై చర్చించారు. సమావేశానికి డిజిపి ప్రసాద రావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రెండు రాష్ట్రాలకు పంపకాలను త్వరితంగా పూర్తి చేయాలని అనిల్ గోస్వామి చెబుతున్న విషయం తెలిసిందే. జూన్ 2లోగా పోలీసు శాఖలో పంపకాలు జరిగిపోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్తులు, అప్పుల వ్యవహారాలు పూర్తి చేయాలని చెప్పారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నిధుల పంపకాలు తక్షణమే జరగాలని సూచించారు. ఉమ్మడి రాజధాని పరిధిలో కేంద్ర బలగాలు మోహరిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications