రూ. 450 కోట్ల బ్లాక్ మనీ: అమీషా పటేల్‌కు లింక్?
భోపాల్: సన్వారియా గ్రూప్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ పీకల లోతు కష్టాల్లో మునిగారు. ఈ గ్రూప్‌నకు, బాలీవుడ్‌కు మధ్య సంబంధాలను ఆదాయం పన్ను (ఐటి) శాఖ బయటపెట్టింది. ఈ విషయంలో ఐటి అధికారులు అధికారులు అనిల్ అగర్వాల్‌ను ప్రశ్నించారు.
ఆ విచారణలో ఆయనకు బాలీవుడ్ నటి అమీషాపటేల్, దర్శకుడు, నిర్మాత ప్రకాష్‌ఝాతో సంబంధాలున్నట్టు గుర్తించినట్లు ఈటీవీ బయటపెట్టింది. సన్వారియా గ్రూపునకు చెందిన 15 కార్యాలయాలపై గత నెలలో దాడులు జరిపిన ఐటి అధికారులు అనిల్ అగర్వాల్ బాలీవుడ్‌లో భారీ పెట్టుబడులు పెట్టినట్టు తేల్చారు.

అమీషా పటేల్‌కు చెందిన ప్రొడక్షన్ హౌజ్‌కు, ప్రకా్‌షఝా సినిమాలకు అనిల్ అగర్వాల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 450 కోట్ల బ్లాక్ మనీని ఐటీ అధికారులు గుర్తించారు.
దీనికి సంబంధించి త్వరలోనే అమీషా పటేల్‌తో పాటు, ప్రకా్‌షఝాను ఐటి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications