ఢిల్లీ సీఎం నక్సలైట్, ఆయనకు చంద్రబాబు మద్దతా!?: స్వామి, మోడీకి ప్రకాశ్ రాజ్ చురక

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక సీఎం కుమారస్వామి మద్దతు తెలపడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి తప్పుబట్టారు. కేజ్రీవాల్ ఓ నక్సలైట్ అని, అలాంటి వ్యక్తికి వారు మద్దతివ్వడం ఏమిటని ప్రశ్నించారు.

మోడీకి ప్రకాశ్ రాజ్ చురకలు

ప్రధాని మోడీకి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చురకలు అంటించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర మంత్రులు కలిసి లెఫ్టి‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఎల్జీ కార్యాలయంలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ... 'డియర్ సుప్రీం లీడర్‌.. మీరు మీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌, యోగా, కసరత్తులతో బిజీగా ఉన్నారని తెలుసు. ఒక్క క్షణం పాటు ఊపిరి పీల్చుకుని చుట్టూ చూడండి. మంచి పని కోసం ధర్నా చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. మీరు కూడా మీ డ్యూటీ చేయండి' అని ట్వీట్ చేశారు.

Prakash Raj lends support to Kejriwal, slams PM Modi, Swamy says Delhi CM is a naxalite

ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ధర్నాను విరమించుకోవాలని నిరసిస్తూ కేజ్రీవాల్‌ ఎల్జీ కార్యాయలయంలో గత కొద్ది రోజులుగా ధర్నా చేపడుతున్నారు. కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో పాటు జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కూడా మద్దతు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+