వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యా, ఏం చేద్దామని...: కేంద్ర మంత్రికి ప్రకాశ్ రాజ్ కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి సత్యపాల్ సింగ్‌కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలపై ఆయన సోమవారం ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు.

డార్విన్ సిద్ధాంతం తప్పు, చెప్పడం ఆపేయండి: కేంద్ర మంత్రిడార్విన్ సిద్ధాంతం తప్పు, చెప్పడం ఆపేయండి: కేంద్ర మంత్రి

మనిషి కోతి నుంచి పుట్టాడనే డార్విన్ సిద్దాంతాన్ని ఇటీవల సత్యపాల్ సింగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. డార్విన్ మానవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని విద్యాసంస్థల్లో బోధించకూడదని ఆయన హుకుం కూడా జారీ చేశారు. దానిపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.

 అయ్యా... అంటూ...

అయ్యా... అంటూ...

"మనిషి కోతి నుంచి పుట్టాడనే విషాన్ని మన ప్రాచీనులు చూడలేదని మంత్రిగారు చెబుతున్నారు. కానీ, ఆయ్యా...అందుకు భిన్నమైన పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నామనే విషయాన్ని అంగీకరించకుండా ఉండగలరా? మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగంకాలంనాటికి తీసుకుని వెళ్తున్నాడు" అని ప్రకాష్ రాజ్ మంత్రి ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలపై శాస్త్రవేత్తలు...

సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలపై శాస్త్రవేత్తలు...

సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలపై భారత శాస్త్రవేత్తలు ఆదివారంనాడు స్పందించారు. వార ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామక్రమ సిద్ధాంతం నిరూపితమైందని, పరిణామక్రమానికి సంబందించిన ప్రాథమిక వాస్తవాలపై ఏ విధమైన వివాదం లేదని, ఇది శాస్త్రీయమైన సిద్ధాంతమని వారన్నారు.

ఇంకా ఇలా అన్నారు...

ఇంకా ఇలా అన్నారు...

డార్విన్ సిద్ధాంతంపై పలు పరిశోధనలు జరిగాయని శాస్త్రవేత్తలు చెప్పారు. పరిశోధనలు, పరిశీలనల ద్వారా ఆ సిద్దాంతం సరైందని నిరూపితమైందని వారన్నారు. మానవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని పాఠాల నుంచి తొలగించడం తిరోగమన చర్యే అవుతుందని కూడా వారు వ్యాఖ్యానించారు. లేదంటే అశాస్త్రీయమైన బోధనలు లేదా మిత్స్ ద్వారా దాన్ని బలహీనపరచడమే అవుతుందని వారన్నారు.

Recommended Video

మోడీ సంతోషంగా ఉన్నారా: ప్రకాశ్‌రాజ్, ట్విట్టర్‌లో సెటైర్లు
 కేంద్ర మంత్రి ఇలా అన్నారు...

కేంద్ర మంత్రి ఇలా అన్నారు...

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జజీవ పరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరులు శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ తప్పు పట్టారు. డార్విన్ సిద్దాంతం తప్పు అని ఆయన అన్నారు. మానవ జాతి భూమి మీద అలాగే ఉండేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో డార్విన్ సిద్ధాంతాన్ని పాఠంగా బోధించడం ఆపేయాలని ఆయన అన్నారు. డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా లేదని ఆయన అన్నారు.

English summary
Prakash Raj tweeted, “our ancestors have not seen ape evolving in to man” says minister. But dear sir,..can you deny that we are witnessing..the reverse....man evolving into ape by digging the past and trying to take us back into STONE AGE"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X