Chandrayaan-3 : చంద్రయాన్ -3పై ప్రకాష్ రాజ్ షాకింగ్ ట్వీట్..! దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు...
చంద్రుడిపై నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ కాబోతోంది. ఈ చారిత్రక క్షణం కోసం భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లోని కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్షణం కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ.. నటుడు ప్రకాష్ రాజ్ అందరికీ షాకిచ్చేలా ఓ ట్వీట్ పెట్టారు.
ట్విట్టర్ లో నిత్యం పలు సామాజిక అంశాలపై, మోడీ సర్కార్, బీజేపీకి వ్యతిరేకంగా పలు ట్వీట్లు పెట్టే నటుడు ప్రకాష్ రాజ్ ఈసారి ఎందుకనో చంద్రయాన్ -3పై పడ్డారు. చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ ను ఎగతాళి చేస్తూ ఓ కార్డూన్ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన వాళ్లకు వళ్లు మండిపోయింది. దీంతో ట్విట్టర్ తో పాటు ఈ ట్వీట్ షేర్ అయిన ఇతర ప్లాట్ ఫామ్స్ పైనా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్నాయి.

ప్రకాష్ రాజ్ చంద్రయాన్ -3 ప్రాజెక్టుపై పెట్టిన ట్వీట్లో ఓ కార్టూన్ జత చేశారు. ఇందులో ఓ లుంగీ ధరించిన వ్యక్తి టీ పోస్తూ కనిపించాడు. విక్రమ్ ల్యాండర్ నుంచి తొలి ఫొటో వచ్చిందంటూ ఓ వ్యాఖ్యను దీనికి జత చేశారు. వావ్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎప్పటిలాగే ఓ హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ ఇస్రోను, చంద్రయాన్ ను అవమానించేలా ఈ ట్వీట్ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయనకు ట్వీట్లతో కౌంటర్లు వేస్తున్నారు.
BREAKING NEWS:-
— Prakash Raj (@prakashraaj) August 20, 2023
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G
ప్రకాష్ రాజ్ ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో బీజేపీపై పలు పోస్టులు పెట్టినప్పుడు ప్రకాష్ రాజ్ ను సమర్ధించిన కాంగ్రెస్ పార్టీ.. చంద్రయాన్ ట్వీట్ పై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ.. ప్రకాష్ రాజ్ చంద్రయాన్ ట్వీట్ ను షేమ్ ఫుల్ అని విమర్శించారు. ఇలాంటి ట్వీట్ పెట్టిన ప్రకాష్ రాజ్ తీరును ఖండిస్తున్నట్లు సింఘ్వీ మరో ట్వీట్ చేశారు. అందులోనే ఇస్రో విజయం భారత విజయమంటూ ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications