రైతులకు మద్దతుగా ఢిల్లీలో రోడ్డెక్కిన నటులు, జంతర్ మంతర్ వద్ద ధర్నా
కరవుతో బాధపడుతున్న తమిళనాడు రైతులకు మద్దతుగా సినీ హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్.. ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు.
న్యూఢిల్లీ: విపరీతమైన కరవుతో బాధపడుతున్న తమిళనాడు రైతులకు మద్దతుగా నటులు కూడా రోడ్డెక్కారు. హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్.. ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు.
అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న రైతులతో కలిసి వీరు జంతర్ మంతర్ వద్ద రోడ్డుపై కూర్చున్నారు. నల్లటి దుస్తులు ధరించిన విశాల్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు.

రైతులు కూడా మెడలో కపాలాలు ధరించి.. కరవు తీవ్రతను ప్రతిబింబించేలా నిరసన వ్యక్తం చేశారు. రైతుల రోదనలను ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడ తీవ్రస్థాయిలో ధర్నా చేస్తున్నామని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
కనీసం తమ నిరసనతోనైనా సంబంధిత శాఖ మంత్రులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications