ఆరెస్సెస్ వేడుకలో ప్రణబ్ ముఖర్జీ: టీఆర్పీ రేటింగ్స్ కోసం ఛానల్స్ లైవ్ కవరేజ్!

నాగపూర్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ వర్షకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అన్ని టీవీ ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

నిత్యం ఆరెస్సెస్ పైన విమర్శలు గుప్పించే మీడియా ఛానల్స్ ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ రావడంతో తమ టీఆర్పీ రేటింగ్స్ కోసం లైవ్ కవరేజ్ ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా టీఆర్పీ మహిమ అని పేర్కొన్నారు.

Pranab Mukherjee at RSS HQ: Ex-president at Sanghs dias

దాదాపు మొదటిసారి టీవీ ఛానల్స్ ఆరెస్సెస్ కార్యక్రమాన్ని టీఆర్పీ రేటింగ్స్ కోసం లైవ్ కవరేజ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా ఆరెస్సెస్ తృతీయ వర్షలో ప్రణబ్ ముఖర్జీ ఏం చెబుతారోననే ఆసక్తి అందరిలోను నెలకొంది.

అంతకుముందు, ఆరెస్సెస్‌ సంఘ్‌ శిక్షవర్గ్‌ ముగింపు కార్యక్రమం నాగ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రణబ్‌ ముఖర్జీ, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒకే వేదికపై ప్రణబ్‌, మోహన్ భగవత్‌ కూర్చున్నారు.

ఈ కార్యక్రమానికి ముందు నాగ్‌పూర్‌కు చేరుకున్న ప్రణబ్‌కు మోహన్‌ భగవత్‌ సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించారు. ఆయన నివాసం ఉన్న ఇంటిని పరిశీలించారు.'భారతమాత గొప్ప కుమారుడికి నివాళులర్పించేందుకు వచ్చా' అంటూ ప్రణబ్ సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు.

కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు పనిచేయడంతో పాటు మాజీ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్‌ ఆరెస్సెస్‌ ఆహ్వానంపై నాగ్‌పూర్‌కు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+