పాపం.. ప్రశాంత్ కిశోర్ వద్ద డబ్బుల్లేవట

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని స్పష్టం చేశారు. తమ పొత్తు- ప్రజలతో మాత్రమే ఉంటుందని తేల్చి పడేశారు. కష్టమైనా, నష్టమైనా ఒంటరిగానే వెళ్తామని, ప్రజలు తమను ఆదరిస్తామనే నమ్మకం ఉందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తోన్నందున నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రశాంత్ కిశోర్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సమీకరించుకుంటోన్నారు. దీనికోసం ప్రత్యేకంగా జన సూరాజ్ కాంట్రిబ్యూషన్ యాప్ ను ఆవిష్కరించారు. దీన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు 100 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు విరాళాలు ఇవ్వవచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

Prashant Kishor Launches Innovative Crowdfunding App

ఈ కార్యక్రమంలో ఉదయ్ సింగ్ మాట్లాడారు. బీహార్‌లోని ఎన్డీఎ ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, వాటికి పాల్పడిన మంత్రుల వివరాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నామని చెప్పారు.

తాజాగా 70,000 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని, దీనిపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశామని ఉదయ్ సింగ్ తెలిపారు. బీహార్ ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం ఈ నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. 1999 జూలైలో జరిగిన ఓ అత్యాచారం-హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రమేయం ఉందని జన సురాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ మున్నా విమర్శించారు. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే సామ్రాట్ చౌదరి, ఆయనతండ్రి శకుని చౌదరి అధికార ఆర్జేడీలో చేరారని గుర్తు చేశారు.

ఖజానా నుండి డబ్బు తీసుకునే సమయంలో ప్రభుత్వ అధికారులు వినియోగ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని, 70,000 కోట్ల రూపాయల ఖర్చు విషయంలో అలాంటివేవీ లేవని ఉదయ్ సింగ్ అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ కేసును విస్మరించిందని ఆయన ఆరోపించారు. నితీష్ కుమార్, సామ్రాట్ చౌదరి మొదలుకుని దాదాపు మంత్రులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఈ మొత్తాన్ని పంచుకున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+