ఇలా చేశావేంది.. ప్రశాంత్ కిషోరా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.
బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది. అధికార జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగిస్తోన్నాయి. ఈ రెండు కూటములతో సంబంధం లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది ప్రశాంత్ కిశోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ.

తన సొంత నియోజకవర్గం రాఘోపూర్ నుంచి తొలుత ప్రశాంత్ కిశోర్ పోటీ చేస్తారని భావించారు. ఆర్జేడీ చీఫ్, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ రేసులో నిలుస్తారని భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ నుంచి వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ మరొక అభ్యర్థిని పోటీకి దింపుతామని ప్రశాంత్ కిశోర్ తాజాగా వెల్లడించారు.
తాను ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ సంస్థాగత కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వస్తే అది తన ఓటమే అవుతుందని తేల్చి చెప్పారు. 120 లేదా 130 సీట్లు వచ్చినా కూడా అది తనకు ఓటమితో సమానమేనని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బీహార్‌ను దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన తొలి 10 రాష్ట్రాల్లో ఒకటిగా మార్చాలనేదే తన ఉద్దేశమని అన్నారు.
ప్రజలు తమపై పూర్తి విశ్వాసాన్ని చూపకపోతే.. జనంలోకి వెళ్తామని, పాదయాత్రను కొనసాగిస్తానని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిని రూపుమాపుతామని, 100 మంది అత్యంత అవినీతిపరులైన నాయకులను విచారించి శిక్షించడానికి కొత్త చట్టం చేస్తామని ఆయన ప్రకటించారు. జన్ సూరాజ్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్న నాయకులు, అధికారులకు ఇది ఓ హెచ్చరిక వంటిదని అన్నారు.
ఈ ఎన్నికలు తమకు లైఫ్ అండ్ డెత్ వంటివని ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. గెలిస్తే 150కి పైగా సీట్లు వస్తాయని, ఓడిపోతే 10 కంటే తక్కువ స్థానాలు దక్కుతాయని గతంలోనే ఆన్ ది రికార్డ్ చెప్పానని గుర్తు చేశారు. ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఎన్డీఏ లేదా ఇండియా బ్లాక్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని అన్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications