Officers: లాఠీచార్జ్ ఎఫెక్ట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ సీరియస్, దెబ్బకు పోలీసు అధికారులపై వేటు !

బెంగళూరు/ మంగళూరు: బీజేపీ యువమోర్చలో చురుకుగా ఉంటున్న ప్రవీణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో అధికారంలో ఉన్న సొంతపార్టీ ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెలుతున్న బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ నళిన్ కలేల్ మీద బీజేపీ కార్యకర్తలు దాడి చెయ్యడం కలకలం రేపింది. హత్యకు గురైన బీజేపీ నాయకుడి అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. రాళ్లదాడిలో బీజేపీ నాయకులతో పాటు హిందూ సంఘ సంస్థ కార్యకర్తలకు గాయాలైనాయి. పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘ, సంస్థ కార్యకర్తలకు తీవ్రగాయాలై ఆసుపత్రిపాలైనారు. అంతిమయాత్ర సందర్బంగా లాఠీచార్జ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసు అధికారుల మీద శుక్రవారం వేటుపడింది. బైక్ లో వెళ్లిన వ్యక్తులు బీజేపీ లీడర్ ప్రవీణ్ ను వెంటాడి వెంటాడి నరికి చంపేసిన విషయం తెలిసిందే.

 బీజేపీ నాయకుడి హత్య

బీజేపీ నాయకుడి హత్య

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కేరళలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను వెంటాడి నరికి చంపేశారు.

 పోలీసుల లాఠీచార్జ్

పోలీసుల లాఠీచార్జ్

బుధవారం ప్రవీణ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో రాళ్లతో దాడులు చెయ్యకూడదని పోలీసులు మనవి చేసినా కొందరు పట్టించుకోలేదు. ఆ సమయంలో పోలీసులు లాఠీలను పని చెప్పడంతో అనేక మంది బీజేపీ కార్యకర్తలకు తీవ్రగాయాలైనాయి.

 ఆర్ఎస్ఎస్ నాయుడికి లాఠీ దెబ్బలు

ఆర్ఎస్ఎస్ నాయుడికి లాఠీ దెబ్బలు

పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘ, సంస్థ కార్యకర్తలకు తీవ్రగాయాలై ఆసుపత్రిపాలైనారు. పోలీసుల లాఠీచార్జ్ లో కాసరగూడుకు చెందిన సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు రమేష్ కు తీవ్రగయాలైనాయి. బీజేపీ నాయకుడు ప్రవీణ్ అంతిమయాత్ర సందర్బంగా లాఠీచార్జ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసు అధికారుల మీద శుక్రవారం వేటుపడింది.

 పోలీసు అధికారుల మీద బదిలి వేటు

పోలీసు అధికారుల మీద బదిలి వేటు

ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా లాఠీచార్జ్ చెయ్యడానికి అవకాశం ఇచ్చిన బెళ్లేరే పోలీస్ స్టేషన్ ఎస్ ఐ, సుబ్రమణ్యపుర ఎస్ఐని బదిలి చేస్తూ ఆదేశాలు జారీ చేశామని పశ్చిమ విభాగం ఐజీపీ దేవజ్యోతి శుక్రవారం మీడియాకు చెప్పారు. విట్ల ఎస్ఐ మంజునాథ్ ను సుబ్రమణ్యపురకు, కుందాపుర గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ సుహాన్ ను బెళ్లేరే పోలీస్ స్టేషన్ కు బదిలి చేశామని పశ్చిమ విభాగం ఐజీపీ దేవజ్యోతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+