ఉరిశిక్ష పడ్డాక కూడా.. నవ్వుతూ రెచ్చగొట్టాడు.. ఆపై..

ముంబై : చేసిన ఘోరానికి ఉరిశిక్ష విధించబడ్డాక కూడా నేరస్తుడిలో కాస్తంతయినా పశ్చాత్తపం లేకపోగా.. తనలోని వెకిలి తనాన్ని మరింత బయటపెట్టుకున్నాడు అంకుర్ పన్వార్ (26). ప్రీతి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమెపై యాసిడ్ దాడి చేసి ఆమె ప్రాణాలు తీసిన అంకుర్.. మరణశిక్ష విధించబడ్డాక కూడా హాయిగా నవ్వుకోవడం గమనార్హం.

మూడేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగిన ప్రీతి కుటుంబ సభ్యులు.. గురువారం తుది తీర్పు కోసం కోర్టుకు హాజరైన సందర్బంలో ప్రీతి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అంకుర్. జడ్జి ఎస్ షిండే పన్వార్‌ అంకుర్ కు మరణశిక్ష విధించిన సమయంలో.. అప్పటికే పుట్టెడు దు:ఖంలో ఉన్న ప్రీతి కుటుంబ సభ్యులు అంకుర్ నవ్వుతూ ఉండడాన్ని తట్టుకోలేకపోయారు.

Preeti Rathi’s killer smiled after Mumbai court sentenced him to death

ఇదే క్రమంలో కోర్టు తీర్పు తర్వాత ప్రీతి తండ్రి అమర్ సింగ్ రాఠి, ఆమె సోదరుడు హితేష్ అలాగే ఓ మహిళ బంధువుతో కలిసి బయటకు వెళ్తున్న సందర్బంలో.. ప్రతీ సోదరుడు 'కోర్టులో ఎందుకు నవ్వావంటూ' అంకుర్ ను ప్రశ్నించాడు. దీంతో మళ్లీ వెకిలిగా నవ్విన అంకుర్.. ప్రీతి మహిళా బంధువు వైపు చూస్తూ అసభ్యకరంగా సైగలు చేశాడు.

దీంతో ప్రీతి సోదరుడు అంకుర్ ను చెంపదెబ్బ కొట్టాడు. మధ్యలో కల్పించుకున్న పోలీసులు ఇద్దరినీ విడిపించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రీతి తండ్రి మాట్లాడుతూ కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+