హెల్మెట్ లేదని గర్బిణి చంపేసిన ఇన్స్ పెక్టర్, ఆసుపత్రిలో విలవిల, ఉసురు తగిలింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: హెల్మెట్ వేసుకోని పాపానికి దంపతులు వెలుతున్న బైక్ ను మరో బైక్ లో వెంబడించి, వాహనాన్ని కాలితో బలంగా తన్నడంతో ఓ గర్బిణి దుర్మరణానికి కారణం అయిన ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ పెక్టర్ కామరాజ్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే జైల్లో ఉన్న కామరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెలుగు చూసింది. మరణించిన గర్బిణి ఉసురు తగిలి కామరాజ్ ఆనారోగ్యానికి గురైనాడని ప్రజలు అంటున్నారు.

  Traffic policeman kicked Pregnant Woman
  జైల్లో కిరాతకుడు

  జైల్లో కిరాతకుడు

  తిరుచ్చి-తంజావూరు జాతీయ రహదారిలో బుధవారం రాత్రి హెల్మెట్ లేకుండా బైక్ లో వెలుతున్న రాజా, ఉష దంపతుల వాహనాన్ని మరో బైక్ లో ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ పెక్టర్ కామరాజ్ వెంబడించాడు. తరువాత రాజా, ఉష వెలుతున్న బైక్ ను బలంగా తన్నడంతో ఆమె కిందపడి మరణించింది.

   రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

  తమిళనాడు రాష్ర వ్యాప్తంగా ఇన్స్ పెక్టర్ కామరాజ్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. గర్బిణి ఉష మరణానికి కారణం అయిన ఇన్స్ పెక్టర్ కామరాజ్ ను ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఉరి తియ్యాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

  జైల్లోని ఆసుపత్రిలో

  జైల్లోని ఆసుపత్రిలో

  ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ పెక్టర్ కామరాజ్ ను సస్పెండ్ చేసిన పై అధికారులు అతన్ని గురువారం జైలుకు పంపించారు. అయితే అనారోగ్యంగా ఉందని చెప్పిన కామరాజ్ శుక్రవారం జైల్లోని ఆసుపత్రిలో చేరాడు.

   ఉష ఉసురుతగిలింది

  ఉష ఉసురుతగిలింది

  గర్బిణి ఉషని పొట్టనపెట్టుకున్న ఇన్స్ పెక్టర్ కామరాజ్ కు ఆమె ఉసురు తగిలి అనారోగ్యానికి గురైనాడని ఆమె బంధువులు అంటున్నారు. చేసిన పాపానికి ఇంత త్వరగా కామరాజ్ అనారోగ్యానికి గురి కావడంతో ఉష ఆత్మశాంతిస్తుందని అంటున్నారు.

   డ్రామాలు వేశాడా ?

  డ్రామాలు వేశాడా ?

  జైల్లోకి వెళ్లిన ఒక్క రోజులోనే ఇన్స్ పెక్టర్ కామరాజ్ ఎలా అనారోగ్యానికి గురైనాడు అంటూ తమిళనాడు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మంచం, దుప్పటి, దిండు ఉంటాయని, అన్ని సౌకర్యాలు ఉంటాయని కామరాజ్ అనారోగ్యంగా ఉందని డ్రామాలు వేస్తున్నాడా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తమిళనాడు ప్రజలు అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Pregnant woman dies: Tamil Nadu traffic inspector Kamaraj has been admitted in the jail hospital.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి