ఒంటరిగా ఉన్న గర్భిణీపై ఇంట్లోనే అత్యాచారం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దారుణాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా, ఓ గర్భిణీ మహిళ అత్యాచారానికి గురైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరాత్ ప్రాంతంలో ఓ గర్భిణీపై పక్కనే ఉండే ఆమె బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళపై ఆమె బంధువు రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి పారిపోయాడు. ఏదో సాకుతో ఇంట్లోకి ప్రవేశించిన రాజు ఆమె ఒంటరిగా ఉండడం గమనించి మూడు నెలల గర్భవతి అయిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Pregnant woman raped in Baraut, Uttar Pradesh

ఈ సంఘటన సోమవారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారంనాడు వెల్లడించారు. మహిళ తనపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+