ప్రీతిజింతా, నెస్ వాడియా కేసు: సచిన్ కొడుకు సాక్షి?

ముంబై: నటి ప్రీతిజింతా, వ్యాపారవేత్త నెస్ వాడియా వివాదంలో మరో కీలక మలుపు! మాజీ ప్రియుడు నెస్ తనను దుర్భాషలాడాడని ప్రీతిజింతా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రోజుకో కొత్త వాదన వినిపిస్తోంది. తాజాగా, ఈ వ్యవహారంలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కీలకసాక్షి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

నెస్ వాడియా.. ప్రీతిజింతాను దుర్భాషాలాడిన సమయంలో అర్జున్ టెండుల్కర్ అక్కడే ఉన్నారట. అంతేకాదు, అర్జున్ పైనా కూడా నెస్ వాడియా నోరుపారేసుకున్నాడట! ముంబై పోలీసులు అర్జున్ టెండుల్కర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

Preity Zinta-Ness Wadia case: New witness Arjun Tendulkar?

మరోవైపు, తన స్టేట్‌మెంట్‌ను ఈ వారాంతంలో రికార్డ్ చేయమని ముంబై పోలీసులకు ప్రీతిజింతా తెలిపింది. కొద్ది రోజులుగా ప్రీతిజింతా, నెస్ వాడియా వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.

కాగా, ఐపిఎల్ ఫ్రాంచైజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో తన వాటాను అమ్మే ప్రసక్తి లేదని ప్రీతిజింతా ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నెస్ వాడియాతో తలెత్తిన వివాదం విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. మీడియాలో ఊహాగానాలకు ఆశ్చర్యపోయానని ఆమె బుధవారం రాత్రి చెప్పింది. తాను ఫ్రాంచైజ్‌లో వాటా అమ్మడం లేదని, అమెరికాలో స్థిరపడాలనుకోవడం లేదని ప్రీతీ జింతా చెప్పారు. భారత్‌లో చాలా ఐఎంపి అంశాలున్నాయని, అవి వార్తలకు అవసరమైవని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+