Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..అందరి కోసం అన్నీ: గతి శక్తి స్కీం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీర్చిదిద్దామని, అక్కడ అభివృద్ధి వేగవంతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ వికేంద్రీకరణ ఆ రెండు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ప్రజా ప్రతినిధుల పాలనను అక్కడ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు..

అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు..

లఢక్‌‌కు ఆధునిక మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని స్పష్టం చేశారు. ఇండస్ సెంట్రల్ యూనివర్శిటీని అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు చె్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలోని రెడ్ ఫోర్ట్ వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తోన్నామని పేర్కొన్నారు.

ఓబీసీ చట్టం తెచ్చాం..

ఓబీసీ చట్టం తెచ్చాం..

జమ్మూ కాశ్మీర్, లఢక్‌లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించామని చెప్పారు. సమగ్ర భారతావనిలో మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడేలా అక్కడ అభివృద్ధి ఉంటుందని అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం పలు చర్యలు తీసుకుంటోన్నామని ప్రధాని చెప్పారు. ఇందులో భాగంగా ఓబీసీ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు.

ఓబీసీలను గుర్తించే హక్కు రాష్ట్రాలకే..

ఓబీసీలను గుర్తించే హక్కు రాష్ట్రాలకే..

ఓబీసీలను గుర్తించే హక్కును రాష్ట్రాలకే అప్పగించామని పేర్కొన్నారు. వైద్య విద్యలో అఖిల భారత కోటాలో ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించామని చెప్పారు. సమాజంలో ప్రతి అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తోన్నామని, అందరి కోసం అన్నీ నినాదంతో ముందుకెళ్తోన్నామని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచన చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం నగదు బదిలీని చేపట్టామని చెప్పారు.

స్మార్ట్ గవర్నెన్స్ అవసరం..

స్మార్ట్ గవర్నెన్స్ అవసరం..

దేశంలో అమలు చేస్తోన్న సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని, దీనికోసం స్మార్ట్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తోన్నామని మోడీ అన్నారు. స్మార్ట్ గవర్నెన్స్‌లో దేశం సరికొత్త అధ్యాయాన్ని రచిస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో విద్య, వైద్యం, పౌష్టికాహారం, రోడ్ల నిర్మాణం, ఉపాధి కల్పనతో ముడిపడి ఉన్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోన్నామని మోడీ అన్నారు. ఈ వెనుకబడిన జిల్లాల్లో అనేకం ఆదివాసీల జనసంఖ్య అధికంగా ఉందని చెప్పారు.

చిన్న, సన్నకారు రైతులే దేశానికి గర్వకారణం..

చిన్న, సన్నకారు రైతులే దేశానికి గర్వకారణం..

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులే దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ అన్నారు. ఛోటా కిసాన్ బనే దేశ్ కీ షాన్.. అనే నినాదంతో చిన్న, సన్నకారు రైతులను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. చిన్న రైతులు పండించే పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవాలనే ఉద్దేశంతో కిసాన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. మొత్తం 70 కిసాన్ రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తోన్నాయని పేర్కొన్నారు.

వందే భారత్ రైళ్లు..

వందే భారత్ రైళ్లు..

దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 వారాల్లో దేశంలోని అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేసేలా 75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అలాగే- ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద లక్షల కోట్ల రూపాయలతో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి ఈ పథకం బాటలు వేస్తుందని ఆయన చెప్పారు. రహదారులను తీర్చిదిద్దేలా సమగ్ర ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+