రాష్ట్రపతి లైన్ క్లియర్: 28న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పచ్చజెండా ఊపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ నెల 18వ తేదీ శనివారం కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు బుధవారం ఉదయం తెలిపినట్లు సమాచారం.
నిజానికి, ఈ నెల 26వ తేదీన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నారు. అయితే, రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంలో జాప్యం జరిగింది. దీంతో ఆయన ఈ నెల 28వ తేదీన రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.

కాంగ్రెసు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో గురువారంనాడు తాను ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాన్ని రాష్ట్రపతి సూచన మేరకు నిర్ణయించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము మద్దతు ఇస్తామనే మాటలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని కాంగ్రెసు పార్టీ బుధవారంనాడు స్పష్టం చేసింది. తాము ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రణాళికను ఆమోదిస్తున్నామని, తాము మద్దతు ఇస్తామని చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటామని కాంగ్రెసు అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications