Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

President Election Results 2022: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, శుభాకాంక్షలు వెల్లువ, యశ్వంత్ కూడా

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి కోసం జూలై 18వ తేదీన ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్‌కు సమయం దగ్గరపడింది. కౌంటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందకు ఈనెల 18న ఆయా రాష్ట్ర అసెంబ్లీల్లో ఓటువేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి..ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తన అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీల తరఫున యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం ముర్ముకు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి.. యశ్వంత్ సిన్హా వైపు మొగ్గు చూపింది. వీరిలో ఎవరు గెలుస్తారనేది గురువారం తేలుతుంది. ఇవ్వాళ జరిగే రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మీ కోసం..

President Election Results 2022 Live Updates In Telugu | Who is Next President Of India | Draupadi Murmu vs Yashwant Sinha Who is Next President Of India

Jul 25, 2022, 11:12 am IST
ఢిల్లీ

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అశ్వికదళం గౌరవ వందనాన్ని స్వీకరిస్తోన్న ద్రౌపది ముర్ము. ఆమె వెంట మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉన్నారు.
Jul 25, 2022, 10:58 am IST
ఢిల్లీ

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది ముర్ముకు ఆహ్వానితులను పరిచయం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
Jul 25, 2022, 10:47 am IST
ఢిల్లీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Jul 25, 2022, 10:44 am IST
ఢిల్లీ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Jul 25, 2022, 10:35 am IST
ఢిల్లీ

ఈ కార్యక్రమానికి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
Jul 25, 2022, 10:14 am IST
ఢిల్లీ

దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న ద్రౌపది ముర్ము. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Jul 25, 2022, 10:11 am IST
ఢిల్లీ

పార్లమెంట్ భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్.
Jul 25, 2022, 9:55 am IST
ఢిల్లీ

ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి భవన్ నుంచి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి పార్లమెంట్ హౌస్‌కు బయలుదేరిన ద్రౌపది ముర్ము.
Jul 25, 2022, 9:31 am IST
ఢిల్లీ

ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి భవన్‌లో సాదరంగా స్వాగతం పలికిన రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవిత కోవింద్. ఇంకాస్సేపట్లో వారిద్దరూ కలిసి పార్లమెంట్ భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
Jul 25, 2022, 9:26 am IST
ఢిల్లీ

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.
Jul 25, 2022, 8:49 am IST
ఢిల్లీ

వీడియో: రాజ్‌ఘాట్‌‌ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పిస్తోన్న ద్రౌపది ముర్ము. ఇంకాస్సేపట్లో ఆమె రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Jul 25, 2022, 8:31 am IST
ఢిల్లీ

రాజ్‌ఘాట్‌‌ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పిస్తోన్న ద్రౌపది ముర్ము. ఇంకాస్సేపట్లో ఆమె రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Jul 25, 2022, 8:05 am IST
ఢిల్లీ

దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరిన ద్రౌపది ముర్ము. తొలుత రాజ్‌ఘాట్‌కు వెళ్తారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పిస్తారు.
Jul 25, 2022, 7:57 am IST
ఢిల్లీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించే తొలి తెలుగు సీజేఐ ఆయనే.
Jul 25, 2022, 7:36 am IST
ఢిల్లీ

ఇవ్వాళ కొత్త రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ము. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Jul 21, 2022, 8:54 pm IST

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 8:53 pm IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 8:52 pm IST

15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 8:51 pm IST

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక కావడంతో బీజేపీ నేతలు, ఒడిశా ప్రజల సంబరాలు.
Jul 21, 2022, 8:50 pm IST

సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఇలా శుభాకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 8:49 pm IST

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 8:47 pm IST

భారత రాష్ట్రపతిగా ఎన్నికలైన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 8:29 pm IST

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Jul 21, 2022, 8:25 pm IST

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రత్యర్థి యశ్వంత్ సిన్హా శుభకాంక్షలు తెలిపారు.
Jul 21, 2022, 7:31 pm IST

ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయానికి చేరువలో ఉండటంతో ఒడిశాలోనే ఆమె స్వగ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
Jul 21, 2022, 7:17 pm IST

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దిశగా దూసుకుపోతున్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెనకబడ్డారు.
Jul 21, 2022, 6:59 pm IST

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయానికి దగ్గరలో ఉండటంతో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తల కోలాహలం.
Jul 21, 2022, 6:32 pm IST

ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. భారతదేశం తన మొట్టమొదటి గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించబోతోంది. భారత ప్రజలకు ఇది చారిత్రాత్మక క్షణం: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
Jul 21, 2022, 6:04 pm IST

రెండు రౌండ్ల తర్వాత ఎన్డీయే బలపరచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యత
Jul 21, 2022, 6:03 pm IST

రాత్రి 8 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+