25, 26తేదీల్లో స్పీకర్ల సదస్సు -రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం -ముగింపునాడు మోదీ స్పీచ్
భారత రాజ్యాంగ దినోత్సవం(నవంబర్ 26) 71వ వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు స్పీకర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ గా పిలుస్తోన్న ఈ సమావేశాలకు గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కెవాడియా పట్టణం వేదిక కానుంది.
నవంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సును భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజుల కాన్ఫరెన్స్ నిర్వహిస్తుట్లు ఆయన తెలిపారు.

లోక్‌సభ, రాజ్యసభతోపాటు దేశంలోని వివిధ చట్టసభల ప్రిసైడింగ్ ఆఫీసర్ల(స్పీకర్లు లేదా చైర్మన్ల) మధ్య చర్చలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో 1921 నుంచి ఈ స్పీకర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల మధ్యలో కొన్ని కాన్ఫరెన్స్‌లు జరుగలేదు. బుధవారం ప్రారంభం కానున్నది 80వ సమావేశం. హార్మోనియస్ కోఆర్డినేషన్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడీషియరీ-కీ టు ఎ వైబ్రాంట్ డెమోక్రసీ అనే థీమ్‌పై ఈ ఏడాది సమావేశాలు నిర్వహిస్తున్నారు.
స్పీకర్ల భేటీకి ప్రధానంగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల గవర్నర్‌లు, గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ, లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వివిధ రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్ల స్పీకర్లు, చైర్మన్లు హాజరుకానున్నారు. సదస్సు చివరి రోజైన నవంబర్ 26న ప్రధాని నరేంద్రమోదీ సమావేశానికి హాజరై తుది ప్రసంగం చేయనున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications