నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా తెరుచుకోనున్న అమృత్ ఉద్యాన్..
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న అమృత్ ఉద్యాన్ నేడు (బుధవారం) రాష్ట్రపతి చేతులమీదుగా తెరుచుకోనుంది. సాధారణ ప్రజలు సందర్శనార్థం ఈ ఉద్యాన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తెరవనున్నారు. ఇక, ఈ ఉద్యాన్ ఆగస్టు 16 వ తేది నుండి వచ్చే నెల 15వ తేది వరకు పర్యాటకుల సందర్శనకు అనుమతించనున్నారు.
ఈ నెల 16 వ తేది నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటలవరకు ఈ ఉద్యాన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అమృత్ ఉద్యాన్‌లో అనేక రకాల గులాబీలు, తులిప్స్, ఔషధ చెట్లు, మొక్కలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ఉద్యానవనాన్ని చూసేందుకు ఒక్క మనదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ అమృత్ ఉద్యానాన్ని సందర్శించేటప్పడు మరో కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.

ఇక, ఈ ఉద్యానవనాన్ని వీక్షించేందుకు వచ్చే సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. వారంలో అన్ని సోమవారాల్లో ఈ పార్క్ సెలవు ఉంటుంది. కాబట్టి, ఈ విషయాన్ని సందర్శకులు గమనంలో ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. పర్యాటకులు తమ ఇంటి ఆవరణలో నాటుకునేందుకు వీలుగా తులసి మొక్కల విత్తనాలతో కూడిన 'సీడ్ పేపర్ల'ను అందివ్వనున్నారు. ఈ సీడ్ పేపర్లు పర్యావరణహిత జ్ఞాపికగా సందర్శకులకు ఇవ్వనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
ఇక, ఈ అమృత్ ఉద్యాన్‌లో ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం రాళ్లతో నిర్మించిన అబాకస్, ధ్వని వెలువడే గొట్టాలు, సంగీత కుడ్యాలను కూడా ఏర్పాటు చేశారు.రాష్ట్రపతి భవన్ ఆవరణలో మొత్తం 15 ఎకరాల్లో ఈ అమృత్ ఉద్యాన్ విస్తరించి ఉంది. ఈ పార్క్‌ను ఉచితంగా సందర్శించొచ్చు. అందుకోసం రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సుమారు 138 రకాల గులాబీలు ఉన్నాయి. వీటితోపాటు 10,000 కంటే ఎక్కువ తులిప్స్ కూడా ఉన్నాయి. దీనిని అప్పట్లో మొఘల్ గార్డెన్ అని కూడా పిలిచేవారట.












Click it and Unblock the Notifications