ఏకీకృత సర్వీసు ఫైలుపై ప్రణబ్ సంతకం, టీచర్లకు ఇదీ లాభం..
ఉపాధ్యాయులకు శుభవార్త. టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఒకటి రెండు రోజల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఉపాధ్యాయులకు శుభవార్త. టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఒకటి రెండు రోజల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన కృషి ఫలించిందని అంటున్నారు. టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్ పరిస్థితిపై వెంకయ్య ఎప్పటికి అప్పుడు ఆరా తీశారు.

టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ పరిశీలించిన ఆయన గురువారం సాయంత్రం సంతకం చేశారు.
దీని వల్ల ఇకపై పంచాయతీ రాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరికీ ఒకేవిధమైన సర్వీస్ రూల్స్ అమలులోకి రానున్నాయి.
ఉపాధ్యాయులందరికీ ఒకే రకమైన సర్వీస్ రూల్స్ కల్పించే ఈ ఫైల్ అమలుకు సంబంధించి నెలకొన్న కొన్ని సమస్యలను న్యాయశాఖ పరిశీలించి అనుమతులు ఇచ్చిన వెంటనే కేంద్ర హోం శాఖ కార్యదర్శి సంతకం పెట్టారు.
హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాలను సంప్రదించారు. దీన్ని ప్రధాని మోడీ కార్యాలయానికి పంపే ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ వెంకయ్య నాయుడు జోక్యం చేసుకొని ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యతను ఆయనకు వివరించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వెంకయ్య అభిప్రాయాలను తీసుకున్న అనంతరం హోంశాఖ నేతృత్వంలోని కమిటీ ఈ ఫైలును క్లియర్ చేసింది.
అనంతరం ప్రధాని కార్యాలయానికి పంపింది. ఈ దస్త్రంపై పీఎంవో అధికారులు ఒక్క రోజులోనే క్లియర్ చేసి ప్రధాని సంతకం కోసం పంపించగా.. ఆయన మంగళవారం సాయంత్రం లక్నో పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. అనంతరం ఈ ఫైలును రాష్ట్రపతి భవన్‌కు పీఎంవో అధికారులు పంపించింది.
అయితే, ఇప్పటివరకు ఈ ఫైలుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఇంగ్లీషులోనే జరిగాయి. దాన్ని అధికార భాషతో పాటు అన్ని భాషల్లోకి ట్రాన్సులేట్ చేసిన అనంతరం సోమవారం తర్వాత అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications