రాష్ట్రపతి: భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, ఈరోజే 5రోజుల పర్యటనకు
న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంముద్ర వేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన భూసేకరణ ఆర్డినెన్స్ ఫైలుపై సంతకం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ ఆర్డినెన్స్ గడువు జూన్ 3న ముగియనున్న సంగతి తెలిసిందే.
భూసేకరణ బిల్లును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీయే ప్రభుత్వం, ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు ఆర్డినెన్స్ ద్వారా నెట్టుకొచ్చిన మోడీ ప్రభుత్వం, శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయాలని నిర్ణయించింది.
ఈమేరకు ఆర్డినెన్స్‌ను జారీ చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ఈ భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆయన ఆమోద ముద్ర వేశారు. కాగా, భూసేకరణ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది.

ఐదు రోజుల పర్యటనకు రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐదురోజుల పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు నుంచి ఐదు రోజులపాటు విదేశీ పర్యటన కొనసాగనుంది. ముందుగా జూన్ 2వ తేదీ వరకు ఆయన స్వీడన్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో స్వీడన్ రాజు, రాణితో సమావేశమవుతారు.
ఈ పర్యటనలో భాగంగా స్వీడన్‌లో ఉన్న స్మార్ట్ సిటీలు, యూరోప్‌లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఉప్పశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత బెలారస్ వెళ్తారు. బెలారస్ అధ్యక్షుడితో సమావేశమైన తర్వార వారిద్దరూ కలిసి వ్యాపార వేత్తలతో సంయుక్త సమావేశం నిర్వహిస్తారు.
జూన్ 4న తర్వాత రాష్ట్రపతి తిరిగి భారత్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ అహీర్, ఎంపీ గులాం నబి అజాద్, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన ఏడుగురు వైస్ ఛాన్సర్లు, 60 మంది వ్యాపార వేత్తలతో వెళ్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications