వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వల్ప అస్వస్థత .. ఛాతీలో అసౌకర్యం, ఆర్మీ ఆస్పత్రిలో చేరిక

|
Google Oneindia TeluguNews

భారత రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యం ఉందని ఆయన చెప్పడంతో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ను వైద్యం నిమిత్తం ఢిల్లీలోని ఆసుపత్రిలోచేర్పించారు . ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ అండ్ ఆర్) హాస్పిటల్ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఛాతీలో అసౌకర్యంగా ఉందని ఆసుపత్రిలో చేరినట్లుగా వెల్లడించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సాధారణ పరీక్షలు చేయించుకున్నారని , ఇప్పుడు ఆయన అబ్జర్వేషన్లో ఉన్నారని వెల్లడించారు
. రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు . భారతదేశంలో పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆర్మీ ఆసుపత్రిలో తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు.

President Ram Nath Kovind admitted in army hospital after chest discomfort, condition stable

కానీ అప్పటి నుండి ఆయనకు ఎలాంటి అస్వస్థత లేదు. తాజాగా ఛాతీలో అసౌకర్యంగా ఉందన్న కారణంతో ఆయన ఆస్పత్రిలో చేరారు . వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు . ఇక రామ్ నాథ్ కోవింద్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మార్చి 8న మహిళా దినోత్సవం రోజు ఆయన సతీమణి, దేశ తొలి మహిళ సవితా కోవింద్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు .

75 సంవత్సరాల భారత రాష్ట్రపతి ఆరోగ్యం పట్ల వైద్యులు శ్రద్ధ తీసుకుంటున్నారు .

English summary
President Ram Nath Kovind today visited the Army Hospital (Research And Referral) in New Delhi for a check-up after complaining of chest discomfort this morning. A medical bulletin said the 75-year-old is undergoing a routine check-up and is under observation. His condition is said to be stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X