నవ భారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి: రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: దేశ ప్రజల స్వేచ్చ, స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు రుణపడి ఉన్నట్టు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోవింద్ తొలిసారిగా సోమవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గాంధీ మహత్ముడు నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, ఆ మహనీయుల స్పూర్తిని ప్రేరణగా తీసుకొని మరింత ముందుకెళ్ళాలని సూచించారు.చట్టాలను రూపొందించి అమలు పరచడం, బలోపేతం చేయడం ప్రభుత్వం బాధ్యతన్నారు.

కానీ, ఆ చట్టాలకు లోబడి ఉండటం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలన్నారు. ముఖ్యమైన లక్ష్యాలతో నవ భారతాన్ని నిర్మించుకొనేందుకు ప్రతినబూనాలన్నారు. జిఎస్‌టిని దేశ ప్రజలు ఎంతో సంతోషంగా అంగీకరించడం ఆనందదాయకమన్నారు.
నవీన భారతంలో పేదరికానికి చోటులేదన్నారు కోవింద్.దివ్యాంగులపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన స్వఛ్చ భారత్‌తో దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పన్నులు చెల్లించడాన్ని ప్రతి ఒక్కరూ విధిగా నిర్వర్తించాలన్నారు.
ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో కోటి కుటుంబాలకు పైగా స్వఛ్చంధంగా గ్యాస్ సబ్సిడీని వదులుకొనేందుకుు ముందుకు రావడంతో వంటగ్యాస్ దేశంలో అనేక వంటగదులకు చేరువయ్యారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అన్నివర్గాల ప్రజలకు చేరేలా కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications