ఆర్టికల్ 370లో ఇమిడి ఉన్న ప్రొవిజన్లు రద్దు తీర్మానంకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌పై అమిత్ షా ప్రతిపాదించిన ఆర్టికల్ 370 రద్దు తీర్మానంకు ఉభయసభలు ఆమోదం తెలపిన సంగతి తెలిసిందే. ఇకపై జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు అధికారిక ముద్ర వేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అంటే ఇకపై జమ్మూ కశ్మీర్‌కు ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదు. ఆర్టికల్ 370లో పొందుపర్చిన అన్ని ప్రొవిజన్లు ఇకపై అధికారికంగా రద్దు అవుతున్నాయని పేర్కొనే అధికారిక పత్రంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు.

ఇక నుంచి భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు ఎలాంటి కేంద్ర చట్టాలు అయితే వర్తిస్తున్నాయో అలాంటి చట్టాలే జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయని రాష్ట్రపతి సంతకం చేసిన పత్రాల్లో పొందుపర్చబడి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయంకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కొన్ని గంటల పాటు బిల్లుపై చర్చలు జరిగాయి. అయితే కొన్ని పార్టీలు బిల్లను వ్యతిరేకించగా మెజార్టీ పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపాయి. మరికొన్ని పార్టీలు బిల్లను వ్యతిరేకిస్తూ ఓటింగ్‌లో పాల్గొనకుండా వాకౌట్ చేశాయి. రాజ్యసభలో బిల్లు సోమవారం పాస్ కాగా... లోక్‌సభలో మంగళవారం పాస్ అయ్యింది.

President Ramnath Kovind declares abrogation of provisions of Article 370

ఆర్టికల్ 370లోని కొన్ని ప్రొవిజన్లను తొలగిస్తున్నట్లు సోమవారం కేంద్రం తెలిపింది. ఇందులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ప్రొవిజన్‌ను తొలగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అంతేకాదు జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రతిపాదిస్తున్నట్లు బిల్లు తీసుకొచ్చింది. అన్నీ చాలా హడావుడిగా జరిగిపోయాయి. అయితే అంతా స్మూత్‌గానే జరిగింది. బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కేంద్రం చేపట్టింది. వీలైనంత ఎక్కువ బలగాలను సున్నితమైన ప్రాంతాల్లో మోహరించింది. కొందరి నాయకులను కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గృహనిర్భందంలో ఉంచింది. ఆ తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.

మొత్తానికి మోడీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే తొలి హామీని నెరవేర్చింది. అదికూడా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పూర్తి చేయడంపై దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఇక లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కార్గిల్, లడఖ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పీఓకే కశ్మీర్‌లో భాగం అని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ... పీఓకే కోసం తన ప్రాణాలైన ఇస్తానని సభలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+