రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఇబ్బందులు.. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్..!

Recommended Video

    Ramnath Kovind's Flight Halted For Three Hours Due To Technical Failure ||

    ఢిల్లీ : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో ఇబ్బందులు పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆయన పర్యటన ఇబ్బందికరంగా మారింది. అయితే సాంకేతిక సేవలు అందించే సిబ్బంది అలర్ట్‌గా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌ను ముందుగానే గుర్తించడంతో రాంనాథ్ కోవింద్ సేఫ్‌గా బయట పడ్డారని ఎయిర్ ఇండియా టీమ్ తెలిపింది.

    మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి తొలుత ఐస్లాండ్ దేశంలో పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారు. అయితే ఆదివారం నాడు స్విట్జర్లాండ్ పర్యటన ముగిశాక స్లోవేనియా వెళ్లాల్సి ఉంది. ఆ క్రమంలో జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాంనాథ్ కోవింద్ ఇబ్బంది పడ్డారు. ఎయిర్ ఇండియా వన్ విమానం గాల్లోకి ఎగిరే సమయంలో ఆఖరి క్షణంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది.

     president ramnath kovind flight technical problem

    ఆయన ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా వన్ విమానంలోని రూడర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా టెక్నికల్ సిబ్బంది దాన్ని వెంటనే పసిగట్టారు. లేదంటే గాల్లోకి ఎగిరాక జరగరానిది జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించడంతో ఆ విమానాన్ని వెంటనే నిలిపివేశారు.

    విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడం.. దాన్ని రద్దు చేయడంతో రాంనాథ్ కోవింద్ దాదాపు 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ క్రమంలో హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సదరు ఫ్లైట్‌కు రిపేర్ చేయించిన తర్వాత అదే విమానంలో స్లోవేనియాకు బయలు దేరి వెళ్లారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+