కార్గిల్ యుద్ద వీరులు చరితార్థులు..!వారందరికీ రుణపడి ఉంటామన్న రాష్ట్రపతి..!!
Recommended Video
ఢిల్లీ/హైదరాబాద్ : దేశమంతా కార్గిల్ విజయ సంబరాల జ్ఞపకాల్లో మునిగితేలుతోంది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బాలను నెమరువేసుకుంటోంది. ఆపరేషన్ విజయ్‌కి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్ దివస్‌ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్ వేదికగా.. ఆనాటి అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు. 'కార్గిల్ దివస్.. కార్గిల్ యుద్ధంలో భారత సేనలు ప్రదర్శించిన అసమాన వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజు. ఈ సందర్భంగా.. దేశ రక్షణ కోసం తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. ఆ అమరులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం' అని కోవింద్ ట్విటర్ వేదికగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి తన అనుభవాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. '1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సేనలను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం లభించింది. అప్పట్లో నేను జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాను. సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం' అని ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే 'మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ఆనాటి వీరులందరికీ నా వినయపూర్వక శ్రద్ధాంజలి' అంటూ నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరులను నివాళులర్పించారు. అలాగే సైనిక ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు సైతం స్మారకం వద్దకు చేరుకొని వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications