భూత వైద్యం పేరుతో భర్తను పంపేసి మహిళపై పూజారి రేప్

భోపాల్: ఓ ఆలయ పూజారి భూతవైద్యం పేరుతో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్తను బయటకు పంపేసి, వివాహితపై ఆమె ఇంట్లోనే భూతవైద్యం పేరుతో పూజారి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని నిషాత్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 6వ తేదీన జరిగింది.

ఆ సంఘటన గురించి పోలీసులకు మంగళవారంనాడు తెలిసింది. దీంతో నిందితుడు పరారయ్యాడు. గత నాలుగేళ్లుగా 34 ఏళ్ల మహిళ సింగర్చోలి ఆలయానికి ప్రతి రోజూ వెళ్తోంది. నెల రోజుల క్రితం ఆలయ పూజారి సంతోష్ కుమార్ కౌశిక్ ఆ మహిళను పట్టుకుని నీకు భూతం పట్టింది, దాన్ని వదిలించాలంటే ప్రత్యేకమైన పూజలు చేయాలని చెప్పాడు. ఆ భూత వైద్యం తానే చేస్తానని కూడా చెప్పాడు.

Priest rapes woman in Bhopal on pretext of performing exorcism

కౌశిక్ ఆ మహిళ ఇంటికి వెళ్లి, ఆమె భర్తను బయటకు పంపేశాడు. అతని మాటలు నమ్మి ఆటో రిక్షా డ్రైవర్ అయిన భర్త బయటకు వెళ్లిపోయాడు. పూజ చేస్తున్న సమయంలో తాను స్పృహ తప్పానని, స్పృహలోకి వచ్చేసరికి తాను నగ్నంగా ఉన్నానని, తన ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా అనిపించిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఆ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని పూజారి ఆమెను బెదిరించాడు కూడా. భర్త తిరిగి వచ్చిన తర్వాత విషయాన్నంతా భర్తకు చెప్పింది. ఆ తర్వాత ఆ దంపతులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కౌశిక్‌పై ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్‌పై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+