వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 మంది భారత మహిళలకు పాక్‌లో ఉగ్రవాద శిక్షణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బెంగాల్‌లోని బుర్ద్వాన్ బాంబుపేలుళ్ల కేసును ఛేదించిన పోలీసులకు మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి రానున్నాయి. అందుకు కారణం ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఫాతిమా బేగం (35)ను బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో 25 మంది భారత మహిళలకు పాకిస్ధాన్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించామని చెప్పారు. దీంతో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మహిళల ఉగ్రవాదుల గురించి ఆరాతీస్తున్నారు.

Prime accused’s wife held in Dhaka, had trained 25 women in Kolkata suburb

నేడో రేపో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) అధికారులు ఆమెను భారత్‌కు తీసుకురానున్నారు. బుర్ద్వాన్ బాంబుపేలుళ్ల కేసులో గత వారంలో హైదరాబాద్‌లో బర్మా శరణార్ది ఖలీద్ (28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఆమె విచారణలో వెల్లడించిన అంశాలపై నిఘా సంస్ధలు దృష్టి సారించాయి. రాష్ట్రాలను కూడా ఇంటిలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయి. ఇటీవల మెడికో ఐఎస్ఐఎస్ చేరేందుకు వెళ్తున్న విషయం తెలిసిన పోలీసులు ఆమెకు, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంక్ ఆఫ్ ఇండియావలో చోరీకి పాల్పడినవారు, బుర్ద్వాన్ బాంబుపేలుళ్ల కేసుతో ఫాతిమాబేగం ముఠాకు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.

English summary
The wife of Burdwan blast mastermind Sajid and women's wing chief of militant outfit Jamaat-ul-Mujahideen Bangladesh (JMB) was arrested on Sunday along with three of her aides by Bangladesh Police, as authorities stepped up action against terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X