Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోడీ దీపావళి ఆర్మీ జవాన్లతో .. జమ్మూలో ఉద్రిక్తతల వేళ; భారత్-పాక్ సరిహద్దులో వేడుకలు !!

ఒకపక్క జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న, సెర్చ్ ఆపరేషన్లు, ఎన్ కౌంటర్ లతో జమ్మూకాశ్మీర్ దద్దరిల్లుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. జమ్మూ & కాశ్మీర్‌లోని రాజౌరిలోని నౌషేరా సెక్టార్‌లోని ఫార్వర్డ్ ఏరియాలో నవంబర్ 4, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. అక్కడ ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొననున్న నేపధ్యంలో నౌషేరా సెక్టార్ పర్యటన కోసం సిద్ధమవుతోంది

 రాజౌరీ నౌషేరా సెక్టార్ లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

రాజౌరీ నౌషేరా సెక్టార్ లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

సైనికులతో దీపావళిని గడపడానికి ప్రధాని మోడీ సరిహద్దు ఔట్‌పోస్టులను సందర్శించాలని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రోజు రాజౌరీ ఎల్ ఓ సి సరిహద్దు చెక్ పోస్ట్ ను సందర్శిస్తారని అక్కడే ఆర్మీ జవాన్ల తో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ దీపావళి రోజున సరిహద్దు ఔట్‌పోస్టులకు వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది . ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి దీపావళికి జవాన్లకు మిఠాయిలు మరియు ఇతర బహుమతులు అందజేసి వారితో సంతోషంగా గడుపుతారు. మోదీ 2019లో కూడా రాజస్తాన్ లో సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

పూంచ్‌, రాజౌరి అటవీప్రాంతాల్లో సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ .. ఈ సమయంలో ప్రధాని పర్యటన

పూంచ్‌, రాజౌరి అటవీప్రాంతాల్లో సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ .. ఈ సమయంలో ప్రధాని పర్యటన

ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ సిబ్బంది జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌, రాజౌరి అటవీప్రాంతాల్లో భారీ సోదాలు నిర్వహిస్తున్నారు. అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతున్న తరుణంలో పూంచ్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరులో అనేక మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాజౌరిలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో జరిగిన మందుపాతర పేలుడులో భారత సైన్యానికి చెందిన ఒక అధికారి మరియు ఒక జవాన్ మరణించారు. ఈ ఘటనలో మరో సైనికుడు గాయపడ్డాడు. అంతకుముందు ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పులలో మొత్తం 9 మంది హతమయ్యారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ, భద్రతా బలగాలలో భరోసా ఇవ్వడానికి, దీపావళి పండుగను వారితో కలిసి జరుపుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ రాజౌరీలోని నౌషేరా సెక్టార్ కు వెళ్లనున్నారు.

 సైనికుల్లో దీపావళి వేడుకలతో ఉత్సాహం నింపుతున్న ప్రధాని మోడీ

సైనికుల్లో దీపావళి వేడుకలతో ఉత్సాహం నింపుతున్న ప్రధాని మోడీ

భారత సైన్యానికి మరొక ముఖ్యమైన లడఖ్ సెక్టార్, ఇక్కడ పొరుగు దేశం ఏదైనా చొరబాట్లను తనిఖీ చేయడానికి 18 నెలలకు పైగా భారతదేశం-చైనా సరిహద్దు వెంబడి సైనికులను మోహరించారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుండి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ మరియు జమ్మూ & కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలలోని ఫార్వర్డ్ ఏరియాల్లో సైనికులతో సమయం గడపడం ద్వారా ప్రధాని దీపావళిని జరుపుకుంటున్నారు. సైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పండుగను జమ్ము కాశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లో జరుపుకోనుండటం విశేషం.

 జమ్మూ పర్యటన తర్వాత ఉత్తరాఖండ్ వెళ్లనున్న మోడీ ..

జమ్మూ పర్యటన తర్వాత ఉత్తరాఖండ్ వెళ్లనున్న మోడీ ..

జమ్మూ కాశ్మీర్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ వెళ్లనున్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో ప్రధాని మోడీ భాగస్వాములు అవుతారు. కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . అక్కడ పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని, విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ప్రధాని మోడీ పర్యటన నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+