బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోడీ

బెంగుళూరు: బీజేపీపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంబురాలు జరుపుకున్నారు. బీజేపీని నమ్మి విజయాన్ని కానుకగా అందించిన బెంగళూరు ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బెంగళూరు ఫలితాలు బీజేపీకి హ్యాట్రిక్ గెలుపును అందించాయని మోడీ వ్యాఖ్యానించారు. బెంగళూరు ఎన్నికల ఫలితాలను బట్టి అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అభివర్ణించారు.

Prime Minister Modi

కన్నడ ప్రజలకు రుణపడి వుంటానని చెప్పిన ఆయన, కర్ణాటక బీజేపీ నేతలకు, బీబీఎంపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. బీజేపీపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైందని అన్నారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజల కోరికలు తీర్చేందుకే తాము ప్రయత్నిస్తామని మోడీ ట్వీట్ చేశారు.

బెంగళూరు నగరంలో 198 వార్డులు ఉన్నాయి. బీబీఎంపీ ఎన్నికలలో నామినేషన్ పత్రాలు సక్రమంగా లేకపోవడంతో హోంగసంద్రవార్డులో బీజేపీ అభ్యర్థి భారతి ఏకగ్రీంగా ఎన్నిక అయ్యారు. ఈ వార్డుని ఎన్నికలు జరగక ముందే బీజేపీ బోణి చేసింది. తరువాత 197 వార్డులలో ఎన్నికలు జరగ్గా, బీజేపీ 100 సీట్లు, కాంగ్రెస్ 76, జేడీఎస్ 14, ఇతరులు 8 స్థానాలను గెలుచుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+