వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 22న దేశంలో జనతా కర్ఫ్యూ.. తేలిగ్గా తీసుకోవద్దు.. : మోదీ సంచలన ప్రకటన,కీలక సూచనలివే..

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూని ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ ప్రకటించాలన్నారు.ఇది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత విధించిన కర్ఫ్యూ అని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎంత సమాయత్తంగా ఉందో తెలుసుకోవడానికి 'జనతా కర్ఫ్యూ' ఒక పరీక్షా సమయంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలంతా సంకల్పం,సంయమనంతో ఈ సంక్లిష్ట స్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు.

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
జనతా కర్ఫ్యూ విధించిన మోదీ

జనతా కర్ఫ్యూ విధించిన మోదీ

కరోనా వైరస్ నియంత్రణ కోసం ఈ ఆదివారం(మార్చి 22న) ప్రతీ పౌరుడు విధిగా 'జనతా కర్ఫ్యూ' పాటించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూని పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ప్రతీ ఒక్కరూ పది మందికి ఫోన్ చేసి కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్ ఎంతమేర సన్నద్దంగా ఉందో తెలుసుకోవడంలో ఇదో పరీక్షా సమయంలా పనిచేస్తుందని తెలిపారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ మన కోసం పనిచేస్తున్న డాక్టర్లు,నర్సులు,వైద్య సిబ్బంది,రైల్వే సిబ్బంది,బస్సు,ఆటో డ్రైవర్స్, పారిశుద్ధ్య కార్మికులు, యావత్ దేశం రుణపడి ఉంటుందన్నారు. కరోనా వైరస్‌కు,ప్రజలకు మధ్య వాళ్లు రక్షకులుగా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కాబట్టి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5గంటల 5నిమిషాలకు ఐదు నిమిషాల పాటు ఇంటి బాల్కనీల్లో,ఇంటి వాకిలిలో,గేట్ల ఎదుట నిలబడి చప్పట్లు కొట్టాలన్నారు. ఇదే మనం వారి పట్ల మనం చాటుకునే అసలైన కృతజ్ఞత అన్నారు.

సంకల్పం,సంయమనం.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిక

సంకల్పం,సంయమనం.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిక

మొదటి,రెండు ప్రపంచ యుద్దాల్లో కూడా ప్రభావితం కానన్ని దేశాలు కరోనా కారణంగా ప్రభావితం అయ్యాయన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికైతే కరోనా వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ గానీ,చికిత్సా విధానం గానీ అందుబాటులో లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ భయాందోళనకు గురికావడం సహజం అని.. కానీ సంకల్పం,సంయమనంతో దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. దాని ట్రాక్ రికార్డును ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. కరోనా నియంత్రణ కోసం దేశంలో ప్రతీ పౌరుడు తనకు తాను ఐసోలేషన్(స్వీయ నిర్భంధం)లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని.. ఇండియాపై అది ప్రభావం చూపదనుకోవడం సరికాదని హెచ్చరించారు. అభివృద్ది చెందిన దేశాల్లో సైతం దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూస్తున్నామని గుర్తుచేశారు.

అలా చేస్తే అన్యాయం చేసినవారవుతారు..

అలా చేస్తే అన్యాయం చేసినవారవుతారు..

కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా ఉండాలంటే ప్రభుత్వ సలహాలు,సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఎవరికి వారు వైరస్ సోకకుండా తమను తాము రక్షించుకోవడంతో పాటు తమ ద్వారా ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటం,సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని చెప్పారు.
అలా కాకుండా ఇష్టమొచ్చినట్టు తిరుగుతాం.. మార్కెట్లకు వెళ్తాం.. కరోనా మమ్మల్ని ఏమీ చేయలేదు అనే నిర్లక్ష్య ధోరణి పనికిరాదన్నారు. అలా చేస్తే మీకే కాదు.. మీ పరిసరాల్లో ఉన్న కుటుంబాలకు కూడా అన్యాయం చేసినవారవుతారని చెప్పారు.

మానవతా దృక్పథంతో వేతనాల్లో కోత విధించవద్దని విజ్ఞప్తి

మానవతా దృక్పథంతో వేతనాల్లో కోత విధించవద్దని విజ్ఞప్తి

అవసరమైతే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని.. ఇంటి నుంచే పనిచేయాలని మోదీ సూచించారు. ఆసుపత్రి సిబ్బంది,వైద్యులు,మీడియా,ప్రజా ప్రతినిధులు తప్ప మిగతావారంతా ఇళ్లల్లోనే ఐసోలేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రాబోయే కొన్ని వారాల వరకు 65 ఏళ్లు పైబడ్డ వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు.అలాగే రొటీన్ చెకప్‌లకు ఆసుపత్రులకు వెళ్లవద్దన్నారు. ఇప్పటి తరానికి ఇదంతా కొత్తగా అనిపించవచ్చు గానీ.. తమ తరం ఇలాంటి పరిస్థితులను చాలానే చూసిందన్నారు. యుద్దం లాంటి సందర్భాల్లో కాగడాలు పట్టుకుని రాత్రంతా గస్తీ కాసేవారని చెప్పేవారు. కరోనా వైరస్ నేపథ్యంలో చాలామంది ఇళ్లకు పరిమితమయ్యే పరిస్థితి నెలకొందని.. కాబట్టి కంపెనీలు మానవతా దృక్పథంతో వేతనాల్లో కోత విధించవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే సంపన్నులు,వ్యాపార వర్గాలు ఇలాంటి సమయంలో ఇతరులకు తమకు తోచిన సాయం చేయాలన్నారు.కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడిందన్నారు. దీన్ని అధిగమించేందుు కేంద్రం ఆర్థిక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు.

English summary
Prime Minister Narendra Modi has made a statement in the wake of the coronavirus clash in India. The Janata curfew was announced on March 22. Aroozhu is supposed to announce the Janata curfew from 9 am to 6 pm. He said the 'Janata curfew' would serve as a test to see how well India is prepared to fight the corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X