Maha Kumbh 2025: మహా కుంభమేళాకు ప్రధాని.. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం
Maha Kumbh 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. భీష్మ అష్టమి రోజున ప్రధాని ప్రయాగ్ రాజ్ కు విచ్చేశారు. ప్రయాగ్ రాజ్ ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని మోడీ.. అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు చేరుకున్నారు.
అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమం ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధానితో పాటు సీఎం యోగి కూడా బోటులో ఉన్నారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 5కు హిందూ క్యాలెండర్ లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చాలా మంది మాఘ అష్టమి, భీష్మ అష్టమిని పాటిస్తారు. ఈ రోజు గుప్త నవరాత్రితో సమానంగా ఉంటుంది. ఉదయం 10 గంటల నాటికి, 10 లక్షలకు పైగా భక్తులు ఈరోజు స్నానమాచరించారు.జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలలో ఇప్పటివరకు 34 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
— ANI (@ANI) February 5, 2025
(Source: ANI/DD)
#MahaKumbh2025 pic.twitter.com/j3OQiCp80q
వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి అనేక మంది ప్రముఖులు కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. వీరితో పాటు అనేక దేశాల ప్రతినిధులు కూడా మహా కుంభమేళాలో స్నానమాచరించారు.












Click it and Unblock the Notifications