వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం తీర్పు నవభారత నిర్మాణానికి పునాది.. సరికొత్త భారతాన్ని రచిద్దాం.. మోడీ

|
Google Oneindia TeluguNews

రామమందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచింది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ తీర్పు అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా దారి చూపిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు నవ భారత నిర్మాణానికి పునాది వేసింది. ఈ నవభారత నిర్మాణంలో మీరు భాగం పంచుకొండి. మనమంత సరికొత్త భారతాన్ని రచించుదాం. ఈ ప్రయాణంలో నా వెంట నడిచే వాళ్లు ఉండటం సంతోషంగా ఉంది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే ఆకాంక్షకు మరింత బలపేతం చేసింది. అందరి విశ్వాసాలను ముందుకు తీసుకెళ్లాం అని మోడీ తెలిపారు.

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు.. కమ్యూనిస్టుల స్పందన ఏమిటంటేఅయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు.. కమ్యూనిస్టుల స్పందన ఏమిటంటే

సుప్రీం కోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి మార్గం చూపింది. దాంతో ప్రజలపై దేశాభివృద్ది కోసం మరింత జవాబుదారి తనాన్ని పెంచింది. ఉజ్వల భవిష్యత్‌కు దారి చూపుదాం. శాంతి, స్నేహం, సద్భావన దేశ వికాసానికి ఎంతో అవసరం. మంచి భవిష్యత్ కోసం చూద్దాం. మనముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. లక్ష్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కలిసి కట్టుగా నడుస్తూ వాటిని అధిగమిస్తాం. ఈ నవంబర్ 9 తేదిని మరోసారి స్మరించుకొంటూ.. రానున్న మంచి రోజులు, పండుగలకు శుభాకాంక్షలు తెలుసుతున్నాను అని మోడీ అన్నారు.

Prime minister Narendra Modi calls for building New India

ఎన్నో దశాబ్దాలుగా వివాదంగా ఉన్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు సమస్యపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించాలని తన తీర్పులో పేర్కొన్నది. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రానికి సూచించింది. వివాదాస్పద రామ మందిర నిర్మాణ వివాదానికి తెరదించడంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
After Supreme court Verdict, Prime minister Narendra Modi given a speech to nation. He praised people of the nation and judiciary system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X