మోడీతో పాదాభివందనం చేయించుకున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పాదాలకు మూడుసార్లు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోడీ పాదాభివందనం చేసిన ఆ వ్యక్తి ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. దీంతో బీజేపీ నేతలంతా వరుసగా మోడీని కలిశారు. ఈ క్రమంలోనే వేదికపైకి వచ్చిన బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి (Ravinder Sing Negi).. ప్రధాని మోడీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.

Prime Minister Narendra Modi feet worship Who is that person

వెంటనే అతడ్ని అడ్డుకున్న ప్రధాని మోడీ.. రవీందర్ నేగి పాదాలకు మూడుసార్లు నమస్కారం చేశారు. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ నమస్కరించిన వ్యక్తి ఎవరనేదానిపై చర్చ కొనసాగింది. ఆయన ఎవరనేదానిపై కొందరు సెర్చ్ చేశారు.

కాగా, రవీందర్ సింగ్ నేగి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్. పట్‌పర్‌గంజ్‌లోని వినోద్ నగర్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు అనిల్ కుమార్, అవధ్ ఓజాకు పోటీగా ఆయన బరిలో దిగారు. 2020లో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ప్రత్యర్థిగా పోటీ చేసిన రవీందర్.. 2 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై 2 వేలకుపైగా ఓట్లతో విజయం సాధించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి దేశ రాజధానిలో జెండా ఎగురేయాలని బీజేపీ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ.. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+