రోడ్ షోలతో బెంగళూరు మొత్తం తిరిగేసిన ప్రధాని మోదీ, ఎన్ని కిలోమీటర్లు అంటే !

బెంగళూరు/హెచ్ఏఎల్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బెంగళూరులో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పూర్తి అయ్యింది. బెంగళూరు నగరంలో మూడు విడతల్లో 28 అసెంబ్లీ నియోజక వర్గాలు పరిదిని కవర్ చేస్తూఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐటీ హబ్ లో మొదటిసారి చరిత్ర సృష్టించారు.

బెంగళూరు సిటీలో మొదటి విడతలో నైస్ రోడ్ జంక్షన్ దగ్గర 4.5 కిలోమీటర్ల రోడ్ నిర్వహించారు. మే 6వ తేదీన బెంగళూరులో కోణెణకుంటే నుంచి మల్లేశ్వరం 18వ క్రాస్ లోని స్యాంకి ట్యాంక్ వరకు 26. 5 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 18 అసెంబ్లీ నియోజక వర్గాలు కవర్ చేశారు.

 modi-

ఆదివారం బెంగళూరులోని తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం దగ్గర నుంచి ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు 6. 5 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. బెంగళూరు చరిత్రలో ఇంత వరకు ఏ ప్రధాన మంత్రి నిర్వహించని రోడ్ షోలు నిర్వహించిన నరేంద్ర మోదీ బెంగళూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఆదివారం బెంగళూరులో నీట్ పరీక్షలు జరుగుతున్న కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్లాన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 10. 20 గంటలకు తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం దగ్గర రోడ్ షో మొదలుపెట్టారు. తిప్పసంద్ర నుంచి బెమల్ గేట్, ఇందిరా నగర్ 80 అడుగుల రహదారిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కొనసాగింది.

 karnatakaelections

ఇందిరానగర్ నుంచి ఇఎస్ఐ ఆసుపత్రి రోడ్డు, దొమ్మలూరు 12వ మెయిన్ రోడ్డు, జోగుపాళ్య, చిన్మయి మిషన్ ఆసుపత్రి రోడ్డు, లక్ష్మీపుర, హలసూరు మెయిన్ రోడ్డు (పాత మద్రాసు రోడ్డు) మీదుగా ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు ఆదివారం ఉదయం 11. 30 గంటల లోపే ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పూర్తి చేశారు.

రోడ్ షో పూర్తి అయిన తరువాత రోడ్ షో నిర్వహించిన వానంలోనే నిలబడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రాంతంలోని నాలుగు వైపుల తిరుగుతూ తల వంచి బెంగళూరు ప్రజలకు శిరసు వంచి నమస్కారం చేశారు. రోడ్ షోలు విజయవంతం చేసిన బెంగళూరు ప్రజలకు తలవంచి నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు ప్రజలకు థ్యాక్స్ చెప్పి అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్లిపోయారు.

Prime Minister Narendra Modi has completed three phases of road shows in Bengaluru city.
స్టార్ హీరోకు వెన్నుపోటు పొడిచింది సినిమా డైరెక్టర్, వలవేసిన క్రైమ్ బ్రాంచ్, మ్యాటర్?

బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్ షోలకు ప్రజల నుంచి ఊహించని మద్దతు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీని చూడటానికి ప్రజలు స్వచ్చందంగా తరలిరావడంతో బెంగళూరులోని అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు విజయం మాదే అంటూ మంచి హుషారుగా ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని దగ్గర నుంచి చూడాలని ఆశ, మోదీ మన ఏరియాకు వచ్చారని ఒక పక్క సంతోషంతో లక్షలాది మంది బెంగళూరు ప్రజలు మూడు విడతల్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా చూశారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగళూరు రోడ్ షోలు సక్సస్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+