స్టార్ హీరోకు వెన్నుపోటు పొడిచింది సినిమా డైరెక్టర్, వలవేసిన క్రైమ్ బ్రాంచ్, మ్యాటర్?
బెంగళూరు/జయనగర్: స్యాండిల్ వుడ్ స్టార్ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తారని వెలుగు చూసిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఆయనకు వార్నింగ్ ఇస్తూ లెటర్లు రాశారు. సుదీప్ ఇంటికే బెదిరింపు లేఖలు వెళ్లడంతో కేసు నమోదు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుదీప్ కు సన్నిహితుడు, కన్నడ దర్శకుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది,
కిచ్చ సుదీప్ కు ఇంతకాలం వెంట వెంటూ నమ్మకంగా ఉండే స్యాండిల్ వుడ్ డైరెక్టర్ రమేష్ కిట్టిని శుక్రవారం రాత్రి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (సీసీబీ) అరెస్టు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో కలిసి ఇటీవల మీడియాతో మాట్లాడిన కిచ్చా సుదీప్ తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నానని, ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పారు.

అదే సమయంలో తన ఇంటికి వచ్చిన రెండు బెదిరింపు లేఖల వెనుక కన్నడ దర్శకుడి హస్తం ఉందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలోనే కిచ్చా సుదీప్ ఆరోపించారు. కిచ్చా సుదీప్ మేనేజర్ జాక్ మంజు కొన్ని రోజుల క్రితం పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కిచ్చా సుదీప్ కేసును సీసీబీ పోలీసులకు అప్పగిస్తూ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కేసు విచారణ చేసిన సీసీబీ పోలీసులు దోమ్మలూరులోని పోస్టాఫీస్ నుంచి కిచ్చా సుదీప్ ఇంటికి బెదిరింపు లేఖలు వెళ్లాయని కొన్ని రోజుల క్రితమే గుర్తించారు. ఇదే కేసులో స్యాండిల్ వుడ్ డైరెక్టర్ రమేష్ కిట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. సినిమా డైరెక్టర్ రమేష్ కిట్టి ఎవరో కాదు, చాలాకాలం పాటు కిచ్చా సుదీప్ చారిటబుల్ ట్రస్ట్ కు అధ్యక్షుడిగా పని చేశాడని పోలీసులు అన్నారు.
కిచ్చా సుదీప్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న స్యాండిల్ వుడ్ డైరెక్టర్ కిచ్చా సుదీప్ కు, హీరో సుదీప్ కు మధ్య డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయని, ఇదే విషయంలో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయని, తరువాత సుదీప్ మీద రమేష్ కిట్టి కక్షపెంచుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
సుదీప్ కు చాలా సన్నిహితంగా ఉన్న నేను కిచ్చా సుదీప్ చారిటబుల్ ట్రస్ట్ లో రూ. 2 కోట్లు డబ్బులు పెట్టానని, వివిద కార్యక్రమాలకు ఆ డబ్బు ఖర్చు చేశానని, తరువాత హీరో సుదీప్ తనకు రూ. 2 కోట్ల డబ్బులు తిరిగి ఇవ్వలేదని, అందుకే కోపంతో ఆయనకు బెదిరింపు లేఖలు రాశానని స్యాండిల్ వుడ్ డైరెక్టర్ రమేష్ కిట్టి విచారణలో అంగీకరించాడని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications