మోడీ కేరళ ప్రజలను అవమానించారు: రాహుల్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ప్రజలను అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని అయిన తరువాత మొదటి సారి కేరళ వెలుతున్న మోడీ కనీసం ప్రోట్ కాల్ పాటించడం లేదని ఆరోపించారు.
రెండు రోజుల కేరళ పర్యటనకు వెలుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఆయన పాల్గోనే కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానించారని విమర్శించారు.
ఈ చర్య తమకు ఆమోదనీయం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కేరళ పర్యటనకు వెలుతున్నారు. ఆరోజు మద్యాహ్నం కొచ్చి విమానాశ్రయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు.

తరువాత కోల్లాంలో మాజీ నేత ఆర్. శంకర్ విగ్రహాన్ని అవిష్కరించే కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గోంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ చాందీ పాల్గోంటారని ఆహ్వాన పత్రికల్లో పేరు ఉంది.
అయితే ఉమెన్ చాందీని స్వయంగా ఆహ్వానించకపోవడంతో ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని చాందీ నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఉమెన్ చాందీని ఆహ్వానించరాదని స్థానికులు వ్యతిరేకిస్తున్నారని నిర్వహకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications