వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్ సఫర్ రైలుకు మోడీ పచ్చ జెండా, సీఎంకు లేని ఆహ్వానం, సిద్దూ ప్రత్యక్షం, ఝలక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు: రెండు రాష్ట్రాల మధ్య సంచరించే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మైసూరులో సోమవారం హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ మైసూరు-ఉదయ్ పూర్ నగరాల మధ్య ప్రజలు సంచరించడానికి హమ్ సఫర్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం సిద్దూకు ఆహ్వానం లేకపోయినా ఆయన అక్కడ ప్రత్యక్షం అయ్యి బీజేపీ నాయకులుకు ఝలక్ ఇచ్చారు.

మోడీకి ప్రత్యేక వేదిక

మోడీకి ప్రత్యేక వేదిక

మైసూరు రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికమీద నుంచి హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రరంభించారు. ఇదే సమయంలో బెంగళూరు - మైసూరు మార్గంలో రైళ్లు సంచరించడానికి కొత్తగా నిర్మించిన డబుల్ లైన్ (.జంట మార్గాలు)ను ప్రధాని మోడీ ప్రారంభించారు.

సీఎంకు ఆహ్వానం లేదు

సీఎంకు ఆహ్వానం లేదు

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించలేదు. కనీసం ఆహ్వాన పత్రికల్లో స్థానిక ఎంపీ ప్రతాప్ సింహా (బీజేపీ) సీఎం సిద్దరామయ్య పేరును వేయించలేదని విమర్శలు వచ్చాయి.

సీఎంను ఎందుకు పిలవాలి ?

సీఎంను ఎందుకు పిలవాలి ?

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న కార్యక్రమానికి సీఎం సిద్దరామయ్యను ఎందుకు ఆహ్వానించాలని స్థానిక లోక్ సభ సభ్యుడు ప్రతాప్ సింహా కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారని, సీఎం సిద్దరామయ్యను పిలవాల్సిన అవసరం లేదని లోక్ సభ సభ్యడు ప్రతాప్ సింహా సమర్థించుకున్నారు.

 సీఎం ప్రత్యక్షం

సీఎం ప్రత్యక్షం

ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి ఆహ్వానించకపోయినా సీఎం సిద్దరామయ్య ఆ కార్యక్రమానికి హాజరై అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. సీఎం సిద్దరామయ్యతో పాటు మైసూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి డాక్టర్ హెచ్.సీ. మహదేవప్ప హాజరైనారు.

Recommended Video

Gujarat Assembly Elections : మోడీకి యువ నేతల దడ, వాళ్ళెవరో కాదు !
మాకు ఆ హక్కు ఉంది

మాకు ఆ హక్కు ఉంది

మైసూరు-ఉదయ్ పూర్ మార్గంలో సంచరించే సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనే హక్కు తమకు ఉందని, సీఎంను పిలవకోవడంతో బీజేపీ బుద్ది బయటపడిందని సీఎం సిద్దరామయ్య మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా తీరుపై మండిపడ్డారు.

English summary
Prime Minister Narendra Modi on Monday launched the Humsafar Express train in Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X