Modi: చెన్నై ఆసుపత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు, ఆరోజు కర్ణాటకలో, వరుసగా !
చెన్నై/అహమ్మదాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యానికి గురైన ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీకి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెన్నైలోని అపోలో ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మెదీ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు, కేరళలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనారోగ్యానికి గురైన ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆసుపత్రిలో చేరారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. దామోదరదాస్ ముల్చంద్ మోదీ, హీరాబెన్ దంపతులకు ఐదు మంది సతానం, ప్రహ్లాద్ మోదీ నాలువవాడు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో టైర్ల షోరూమ తో పాటు కొన్ని వ్యపారాలు చేస్తున్నారు.

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న తమిళనాడులోని బీజేపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలిసింది. తమిళనాడు బీజేపీ శాఖ రాష్ట్ర ఆధ్యక్షుడు అన్నామలైతో పాటు చెన్నైలోని బీజేపీ సీనియర్ నాయకులు, ఓ కేంద్ర మాజీ మంత్రి ఆసుపత్రికి వెళ్లి ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలిసింది.
గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని బండీపుర ఫారెస్టు సమీపంలో వెలుతున్న ప్రహ్లాద్ మోదీ కారు ప్రమాదానికి కారణం కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీకి సొంత తమ్ముడు అయినా ప్రహ్లాద్ జోషి మాత్రం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు.












Click it and Unblock the Notifications