ఆర్ఆర్ఆర్ "మల్లీ" ఇప్పుడు గ్లామర్ బ్యూటీ అయ్యిందయ్యో..!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన "RRR" చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాతో ఇండియన్ సినిమా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే విజయంగా నిలిచింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్.టి.రామారావు జూనియర్ ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
అంతేకాకుండా ఈ చిత్రం ఆస్కార్ వేదికపై కూడా చరిత్ర సృష్టించింది. ఇందులోని Naatu Naatu పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చింది. దీంతో ఈ మూవీలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే అందరిలో ఎక్కువగా ఆకట్టుకున్న పాత్రల్లో ఒకటి గోండు బాలిక 'మల్లీ'. ఈ మూవీలో స్టోరీ పరంగా చూస్తే మెయిన్ ఆ బుడ్డదే అని చెప్పాలి.

కాగా సినిమా ప్రారంభంలో "కొమ్మ ఉయ్యాలా..." పాటతో తన అమాయకపు చిరునవ్వు, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ చిన్నారి పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుంది. మల్లీని బ్రిటిష్ అధికారులు బలవంతంగా తీసుకెళ్లడం వల్లే కథ ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి కోసం చేసే పోరాటమే మొత్తం సినిమాలో ప్రధాన భావోద్వేగంగా నిలుస్తుంది. అందుకే మల్లీ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
మల్లీగా నటించిన ట్వింకిల్ శర్మ..
ఈ పాత్రలో నటించిన చిన్నారి పేరు ట్వింకిల్ శర్మ. ఆమె ఇప్పటికే చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ డాన్స్ రియాలిటీ షోల ద్వారా పాపులర్ అయిన ట్వింకిల్ శర్మ తన డ్యాన్స్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ సంపాదించింది. డాన్స్ షోలతో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపించింది. అలాగే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. చిన్న వయసులోనే కెమెరా ముందు తన ప్రతిభను నిరూపించుకున్న ట్వింకిల్‌కు RRRలో అవకాశం రావడం కెరీర్‌లో పెద్ద మైలురాయిగా మారింది.
RRR షూటింగ్ ప్రారంభమైన సమయంలో ట్వింకిల్ శర్మ ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. అయితే కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ ఎక్కువ కాలం కొనసాగడంతో, సినిమా పూర్తయ్యే సమయానికి ఆమె ఇంటర్ పూర్తి చేసిందని తెలుస్తోంది. 2022లో విడుదలైన RRRకు ఇప్పుడు నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో ట్వింకిల్ పూర్తిగా మారిపోయింది. చిన్నారి నుంచి అందమైన యువతిగా మారడంతో ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications