PF Withdrawal: ఏటీఎం, యూపీఐతో పీఎఫ్ విత్ డ్రా అప్పటి నుంచే..! లిమిట్స్ ఇవే..!

పీఎఫ్ చందాదారులకు భవిష్యనిధి సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ను అత్యవసర సమయాల్లో వెంటనే విత్ డ్రా చేసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకునేందుకు వీలుగా చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కివచ్చాయి. దీంతో ఈ నెలాఖరు నుంచే ఈ రెండు పద్దతుల్లో పీఎఫ్ విత్ డ్రాను అమల్లోకి తెచ్చేందుకు భవిష్యనిధి సంస్థ (EPFO) సిద్దమవుతోంది. రాబోయే EPFO 3.0 డిజిటల్ ప్లాట్‌ఫామ్ కింద ఈ మార్పులు అమలు చేస్తారు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు త్వరలో యూపీఇఏ యాప్‌లు, ఈపీఎఫ్ లింక్ అయిన ఏటీఎంల ద్వారా తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌డ్రా చేసుకోగలుగుతారు. NDTV కథనం ప్రకారం ఈ సదుపాయం జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఈ సదుపాయం ప్రారంభ ప్రకటన త్వరలో చేస్తామన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ కొత్త సదుపాయం యొక్క టెస్టింగ్ ఇప్పటికే పూర్తయిందని ఆయన వెల్లడించారు.

Big News for EPFO Members Withdraw PF Money Via UPI and ATM by Month End Check Your Limit

యూపీఐ, యూపీఐ లింక్ అయిన ఏటీఎంలను ఉపయోగించి, వినియోగదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణమే బ్యాంకు ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెప్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ కాగితపు పనిని, జాప్యాన్ని తగ్గించి, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం, పీఎఫ్ విత్‌డ్రాయల్స్ కోసం సభ్యులు సాధారణంగా క్లెయిమ్‌లను సమర్పించి, ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు తాజా మార్పులతో ఈ సమస్యలు తీరిపోనున్నాయి.

Big News for EPFO Members Withdraw PF Money Via UPI and ATM by Month End Check Your Limit

పదవీ విరమణ పొదుపుల భద్రతకు ఎటువంటి రాజీ లేకుండా చూసేందుకు, ఎలాంటి ప్రమాణీకరణ, మోస నివారణ భద్రతా చర్యలు అమలు చేయబడతాయనేదే అసలైన పరీక్ష అని నిపుణులు చెప్తున్నారు. ఇతర కీలక మార్పులతో పాటు పీఎఫ్ క్లెయిమ్‌ల కోసం ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని ప్రభుత్వం రూ.1 లక్ష నుండి రూ. 5లక్షలకు పెంచింది. అలాగే సభ్యులు ఎక్కువ పత్రాలపై ఆధారపడకుండా, తమ గుర్తింపును ధృవీకరించుకోవడానికి ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ని వాడుకోవచ్చు. ఈ అప్‌గ్రేడ్ ద్వారా వేగవంతమైన, సరళమైన యూఏఎన్ యాక్టివేషన్, ఆన్‌లైన్‌లో పీఎఫ్ పాస్‌బుక్‌ను సులభంగా యాక్సెస్ చేయడం, ఆధార్ అనుసంధానిత వివరాలను త్వరగా సరిదిద్దుకోవడం వంటివి చేయొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+