Dubai: దుబాయ్ లో తొలి హిందు దేవాలయం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
దుబాయ్.. ఈ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దుబాయ్ కి చాలా మంది వెళ్తుంటారు. ముఖ్యంగా దుబాయ్ కి ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువగా వెళ్తుంటారు. ఆ దేసం ముస్లిం కంట్రీ.. అక్కడ అందు ముస్లింలే ఉంటారు. అయితే అక్కడికి వెళ్లే పర్యటకు సంఖ్య పెరుగుతోంది. అలాగే అక్కడి వెళ్లి పని చేసే హిందువుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో హిందు దేవాలయాన్ని ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ లో హిందు దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటలకు దుబాయ్ వెళ్లనున్నారు. రెండు రోజులపైటు యూఏఈలో ఉండనున్నారు ప్రధాని మోడీ. బుధవారం అబుదాబీలో నిర్మించిన తొలి హిందు దేవాలయం BAPS మంధిర్ ను నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత దుబాయిలో ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆ తర్వాత దుబాయ్ లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024కు గౌరవ అతిథిగా మోడీ హాజరకానున్నారు. 2015 తర్వాత ప్రధాని మోడీ UAEని సందర్శించడం ఇది ఏడవ సారి కానుంది. మోడీ తన పర్యటనలో భాగంగా దుబాయ్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్, వైవ్ ప్రెసిడెంట్లతో సమావేశం కానున్నారు. "ఈరోజు భారతీయులను కలవడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని" అని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
జనవరి 10న యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చారు. అప్పుడు ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. సంవత్సరకాలంలో భారత్, దుబాయ్ 5 సార్లు సమావేశమయ్యాయి. 2023లో మోడీ అబుదాబీలో ఆ దేశ అధ్యక్షుడిని కలిశారు. అదే ఏడాది నవంబర్ 30న కూడా కాప్-28లో పాల్గొన్నప్పుడు కూడా ఇరువురు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications