మినీ స్కర్ట్‌లతో రావాలని యువతులకు ప్రిన్సిపల్ ఆర్డర్

నవాబ్‌గంజ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు అనితా రాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తోంది. అయితే, నూతన విద్యా సంవత్సరం నియమావళి అనుసరించి 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థినులు తెల్లచొక్కా, గ్రే కలర్ స్కర్టులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థినుల్లో అత్యధికులు అనితా రాణి ఉత్తర్వులకు అనుగుణంగా యూనిఫాం ధరించడం మొదలుపెట్టారు. కొందరుమాత్రం పాత విధానాన్ని అనుసరిస్తూ సల్వార్ కమీజ్, చున్నీ ధరించి స్కూల్‌కు వస్తున్నారు. దీంతో, ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారిని మందలించింది.
ఆ విద్యార్థినులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు ప్రిన్సిపల్ కార్యాలయం ముంద నిరసన చేపట్టారు. దీంతో, ఆ ప్రిన్సిపాల్ దిగి వచ్చింది. ఆరో తరగతి, అంతకంటే పై తరగతి చదివే వారికి స్కర్ట్‌ల నుండి మినహాయింపు ఉన్నదనే ప్రభుత్వ కాపీని విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెకు చూపించారు.












Click it and Unblock the Notifications