Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీటూ క్యాంపెయిన్: ఎంజే అక్బర్ కేసులో జర్నలిస్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు

కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ ప్రముఖ జర్నలిస్టు ప్రియా రమణిపై వేసిన కేసులో ఆమెకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 10వేలు పూచీకత్తుతో ప్రియా రమణికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ వచ్చే నెల 8కి కేసును వాయిదావేసింది.

వచ్చేనెలలో కేసు విచారణ సందర్భంగా తనపై ఆరోపణలు చేస్తారని ఆ తర్వాత ఏప్రిల్ 10న మళ్లీ విచారణకు వచ్చే సమయంలో తను చెప్పాల్సింది న్యాయస్థానానికి చెబుతానని ప్రియారమణి తెలిపారు. గతేడాది మీటూ క్యాంపెయిన్‌లో భాగంగా లైంగిక వేధింపులపై మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి అక్బర్‌పై ఆరోపణలు చేశారు. 1990వ దశకంలో అక్బర్‌తో కలిసి తాను పనిచేసినట్లు చెప్పారు. ఈమెతో పాటు గజాలా వాహబ్, షూమా రాహ, అంజు భారతి, షుతపా పాల్ కూడా పనిచేసినట్లు ఆమె చెప్పారు.

Priya Ramani gets bail in defamation case filed by MJ Akbar over #MeToo

కేసు విచారణ చేసిన కోర్టు తనపై రమణి చేసిన ఆరోపణలు సత్యదూరమని, ఊహాజనితమైనవని అక్బర్ ఫిర్యాదు చేశారని.. అయితే అది ప్రాథమిక ఫిర్యాదుగానే చూస్తున్నామని చెప్పింది కోర్టు. పూర్తి స్థాయి విచారణ జరిగే వరకు జర్నలిస్టు ప్రియారమణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 20 ఏళ్ల క్రితం అక్బర్ తనను లైంగికంగా వేధించారని ప్రియా రమణి ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఇద్దరూ జర్నలిస్టులుగా పనిచేసేవారు. అయితే ప్రియారమణి ఆరోపణల్లో వాస్తవం లేదని అక్బర్ వెల్లడించారు. అక్బర్‌పై ఆరోపణలు రావడంతో తన కేంద్రమంత్రి పదవికి గతేడాది అక్టోబర్ 17న రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమెపై పరువునష్ట దావా వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+