రాహుల్ గాంధీ కోసం జీవితాన్ని త్యాగం చేస్తా : బీజేపీపై విరుచుపడ్డ ప్రియాంక గాంధీ
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. మరొసారి అధికారం చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని కొట్‌కాపూరాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ, ఆప్‌లపై విరుచుకుపడ్డారు. దేశాన్ని భ్రష్టు పట్టించిన బీజేపీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మోద్దన్నారు. మోదీ పాలనలో పేదలకు ఓరిగిందేమి లేదని మండిపడ్డారు.

బీజేపీ నేతల మధ్య భేదాభిప్రాయాలు
తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రియాంక గాంధీ చెప్పారు. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా తన కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. తమ మధ్య భేదాభ్రిప్రాయలు ఉన్నట్లు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీలోనే భేద్రాభిప్రాయలు ఉన్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి, సీఎం యోగికి మధ్య భేదాభిప్రాయాలున్నాయని ఆరోపించారు.

తమ పిల్లల్లో ఉంది పంజాబీ రక్తమే
తాను పెళ్లి చెసుకున్నది పంజాబీనే అని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. తమ పిల్లల్లో ఉంది పంజాబీ రక్తమే అని చెప్పారు. పంజాబీల ప్రజల మనస్తత్వాలను తాను అర్థం చేసుకోగలని... వారు చాలా ధైర్యవంతులని ప్రియాంక పేర్కొన్నారు. మరో సారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పేర్కొన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పదవి నుంచి తొలగంచడానికి గల కారణాలను ప్రచారంలో వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ నడిపించిందని అందుకే కెప్టెన్ ను తొలగించి చన్నీకి సీఎం బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.

ఆప్ పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టింది..
అటు ఆమ్ఆద్మీ పార్టీలో తీవ్ర స్థాయిలో ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ఆప్ పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల గుణగణాలు, పార్టీల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజలకు వెన్నంటి ఉండేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.












Click it and Unblock the Notifications