రాహుల్ గాంధీతో గేమ్స్, జేపీ నడ్డా, మాన్వియా మీద కేసు పెట్టిన ప్రియాంక్ ఖార్గే !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని కదలించడానికి అవకాశం లేకుండా ఆ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక ఐటీ, బీటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే బీజేపీ నాయకుల మీద కేసు పెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, బీజేపీ చండీగఢ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సూద్ ల మీద మంత్రి ప్రియాంక్ ఖార్గే కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ పరువుకు భంగం కలిగించేలా ఆయన ప్రసంగాలను మార్ఫింగ్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వాటిని వైరల్ చేశారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

Priyank Kharge

బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా వైరల్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ ఓ ప్రమాదకరమైన వ్యక్తి అంటూ వ్యాఖ్యానిస్తూ త్రీడీ యానిమేటెడ్ వీడియో తయారు చేశారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. వీళ్లు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తయారు చేసిన ఆ వీడియోను జేపీ నడ్డా కూడా ఆ వీడియో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయ్యిందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

Priyank Kharge

జూన్ 17వ తేదీన బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో రాహుల గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బ తియ్యడానికి వీడియో పోస్టు చేశారని, ఆ వీడియోను బీజేపీ నాయకులు వైరల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తీసుకువానికి జేపీ నడ్డా, అమిత్ మాన్వియా, అరుణ్ సూద్ ప్రయత్నాలు చేస్తున్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెలుతున్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. ఇస్లామిక్ నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారని, రాహుల్ గాంధీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

Priyank Kharge

రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతినేలా వీరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బ తియ్యడానికి ప్రయత్నిస్తున్నారని, జేపీ నడ్డా, అమిత్ మాల్వియా, అరుణ్ సూద్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మంత్రి ప్రియాంక్ ఖార్గే ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+