Bakrid: మీరు ఫ్లాష్ బ్యాక్ కు పోతే మేమ రంగంలోకి దిగుతాము, మీరే ఓకే అంటే !
బెంగళూరు/మంగళూరు: ముస్లింల చాలా ముఖ్యమైన పండుగ బక్రీద్ రాబోతోందని, గోసంరక్షణ పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారిమీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం సత్తా ఏంటో చూపాల్సి ఉంటుందని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. దీని ద్వారా గోసంరక్షకులకు మంత్రి ప్రియాంక్ ఖార్గే నేరుగా హెచ్చరికలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
బక్రీద్ సందర్భంగా గోసంరక్షణ కోసం ప్రయత్నించే దమ్ముంటే రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకోవాలనే తమ ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి ప్రియాంక్ ఖార్గే గుర్తు చేశారు. కొంత మంది గో సంరక్షణకు పేరుతో కొందరు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటకలో అక్రమ గోహత్యను ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని బీజేపీ ఆరోపించింది. దీనిపై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు.

కొద్ది రోజుల క్రితం ప్రియాంక్ ఖర్గే ప్రసంగానికి సంబంధించిన చిన్న వీడియోను బీజేపీ రాష్ట్ర పోలీసు అధికారులకు షేర్ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 స్పష్టంగా జంతువులను వధించడాన్ని నిషేధిస్తుంది, ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లో ఈ నియమాలు అమలులో ఉంటాయని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే, ప్రియాంక్ ఖర్గే తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ గోహత్యను ప్రోత్సహించడమే కాకుండా దానిని వ్యతిరేకించే వారిని అరెస్టు చేయాలని పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు అని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇది బాబా సాహెబ్ భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందో లేదో స్వయం ప్రకటిత రాజ్యాంగ నిపుణుడు, కర్ణాటక సిద్ధరామయ్య వివరించాలి. కాకపోతే ఇద్దరూ భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి అని ప్రియాంక్ ఖర్గే వీడియోతో పాటు నోట్‌తో పాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. కర్ణాటక బీజేపీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను నిర్వహిస్తున్న మీ ఏజెన్సీని తొలగించాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక్ ఖార్గే ట్విట్ చేశారు.

వారికి కన్నడ అర్థం కాదు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం మర్చిపోయారు. గోసంరక్షణ చట్టబద్ధమైనదని, గోసంరక్షకులు ఉండాలని బీజేపీ చెబుతోందా? ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించమని ప్రోత్సహించారా?. మీరు ఇలాగే ప్రవర్తిస్తే కర్ణాటక ప్రభుత్వం మీకు రాజ్యాంగంలోని అసలు శక్తిని చూపుతుంది అని మంత్రి ప్రియాంక్ ఖార్గే సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
Dear @BJP4Karnataka , time to fire your agency who is handling the party’s twitter handle . Clearly they don’t understand Kannada, forget understanding the Constitution.
— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) June 25, 2023
Is BJP suggesting cow vigilantism is legal & the vigilantes of any kind should be encouraged to break the… https://t.co/hqwBonWYKQ
కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రసంగానికి సంబంధించిన సుదీర్ఘ వీడియోను ఆంగ్ల ఉపశీర్షికలతో కూడిన వీడియోను ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి ట్వీట్ చేశారు. దాని ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. బక్రీద్ వస్తోంది, చట్టం ప్రకారం, అందరూ ఎస్‌ఐలు డీఎస్పీలు దయచేసి వినండి, గోసంరక్షకులు, రైతులు ఎంత కష్టపడుతున్నారో వారికి తెలియదు. ఎవరైనా శాలువా కప్పి మేము దీని నుండి వచ్చాము అంటూరెచ్చిపోతే కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. మొత్తం మీద బక్రీద్ పండుగ సందర్బంగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బక్రీద్ పండుగ సందర్బంగా ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిద్దరామయ్య ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications