అందుకే పోటీ చేయడంలేదు - ప్రియాంకగాంధీ

ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్‌సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. ఈ అంశంపై తొలిసారి స్పందించారు. తాను ఈస్ట్ యూపీకి ఇంఛార్జ్‌గా ఉన్నానని, తన పరిధిలోని 41 స్థానాల అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రియాంక స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే తన లక్ష్యమని ప్రియాంక స్పష్టం చేశారు. కేవలం తన గెలుపు కోసం పనిచేసి మిగిలిన అభ్యర్థుల విజయావకాశాలను చేజార్చుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందుకే పోటీ చేయవద్దని డిసైడ్ అయ్యానని, పార్టీ సీనియర్లను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని అన్నారు ప్రియాంక. పార్టీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిందని, హైకమాండ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు.

Priyanka Gandhi clearified Why Shes Not Contesting Against Modi

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మోడీకి ప్రత్యర్థిగా ప్రియాంకగాంధీ బరిలో దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థిగా అజయ్ రాయ్‌ పేరు ప్రకటించింది. దీంతో ప్రియాంక ఎందుకు పోటీ చేయడంలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఊహాగానాలకు తెరదించుతూ క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+