రైతు రుణమాఫికి లేని డబ్బు పారీశ్రామికవేత్తలకు ఎక్కడిది ? ప్రియాంక గాంధి
సార్వత్రిక ఎన్నికలు మరో రెండు దశలు ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈసంధర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధి మోడీ తీరుపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ్ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమే పాల్గోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజాసమస్యలపై పట్టింపులేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి మండిపడ్డారు. రైతు రుణాలను మాఫి చేయని ప్రధానమంత్రి వేల కోట్ల రుపాయాలను పారీశ్రామిక వేత్తలకు ఎలా ఇచ్చారని ఆమే ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే మోడీ రైతులతో మాట్లాడేందుకు కూడ కనీస సమయం కూడ ఇవ్వలేదని ఆమే దుయ్యబట్టారు. దేశంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం రైతులను పట్టించుకోకుండా బడా పారిశ్రామికవేత్తలకు సుమారు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలను రుణమాఫి చేశారని అన్నారు. ఈనేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ తోపాటు హరియాణ,పంజాబ్ రాష్ట్ర్రాలతో పాటు పలు రాష్ట్ర్రాల రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారని అన్నారు. అయిన వారితో మాట్లాడేందుకు కనీస సమయాన్ని కూడ వెచ్చించలేదని విమర్శించారు.

మరోవైపు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కిసాన్ సమ్మాన్ అంటూ ప్రచారం చేస్తోందని అన్నారు. మరి రైతుల రుణమాఫికి డబ్బులు లేనప్పుడు లక్షల కోట్ల రుపాయాలను పారిశ్రామిక వేత్తలకు ఎలా రుణమాఫి చేశారని ఆమే ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే రైతుల బీమా డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ఆమే అడిగారు. కాగా మోడీ స్నేహితులు ఆయన హయాంలో పదివేల కోట్ల రుపాయలు ఎలా సంపాదించారని దుయ్యాబట్టారు. ఇలా రైతులతో పాటు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా మోడీ మాత్రం వీటీని పట్టించుకోకుండా పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన మోడీ ఆయన స్వంత నియోజకవర్గంలోని ఒక్క గ్రామానికి కూడ వెళ్లలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో ఉద్యోగాల హామీని కూడ నెరవేర్చలేదని ప్రియాంకా గాంధి అన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications