మమ్మల్నీ తనిఖీ చేయొచ్చు: ఎస్పిజికి ప్రియాంక లేఖ

ప్రస్తుతం విఐపి జాబితాలో ఉన్న ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా ప్రత్యేక మినహాయింపులు వర్తిస్తున్నాయి. విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా తన భర్త రాబర్ట్ వాద్రాకు ఇస్తున్న మినహాయింపులను రద్దు చేసే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. ఆమె ఎస్పిజి సారథి దుర్గాప్రసాద్‌కు లేఖ రాశారు.
వాద్రాకు ఈ తరహా మినహాయింపులివ్వాల్సిందిగా తామెవ్వరమూ అడగలేదనీ.. అప్పటి ఎస్పిజి సారథులు, ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయమేననీ ఆమె తన లేఖలో పేర్కొన్నారు. మామూలు ప్రయాణికుల్లాగానే తమనూ విమానాశ్రయాల్లో తనిఖీ చేయవచ్చునని ప్రియాంక తెలిపారు.
కాగా, దీనిపై ఎస్పిజి వర్గాలు స్పందించాయి. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఆధారంగా జరుగుతుందని తెలిపాయి.












Click it and Unblock the Notifications